తమ మీద ఛార్జిషీట్ వేసే హక్కు భాజపాకు ఎవరిచ్చారని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకుపోతున్నందుకా... తమపై ఛార్జిషీట్ అని నిలదీశారు.
భాజపా నేతల ఛార్జిషీట్.. గోబెల్స్ డైరీలా ఉంది : కేటీఆర్ - trs working president ktr
భాజపా నేతలు గోబెల్స్ కజిన్ బ్రదర్స్‌లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. కాషాయ నేతల ఛార్జిషీట్.. గోబెల్స్ డైరీలా ఉందని తెలిపారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
భాజపా నేతలు గోబెల్స్ కజిన్ బ్రదర్స్‌లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కమలం నేతల ఛార్జిషీట్ గోబెల్స్ డైరీలా ఉందని ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనందుకు, వరద సాయం చేయనందుకు భాజపాపై ఛార్జిషీట్ వేయాలని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :భాజపాకు ఓటేస్తే జీహెచ్ఎంసీని డిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు: కేటీఆర్