సైబరాబాద్ సీపీ సజ్జనార్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో పోలింగ్ కేంద్రం సందర్శించి భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదు: సీపీ - ghmc elections latest news
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి సమీక్షించారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించేది లేదు: సీపీ
సైబరాబాద్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. కొన్నిచోట్ల డబ్బులు పంచుతున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారని.. అక్కడ వెంటనే పోలీసులు రంగంలోకి పరిస్థితిని చక్క దిద్దుతున్నారని సజ్జనార్ తెలిపారు.