పని చేసే వ్యక్తి తమకు కావాలని సనత్‌నగర్ ప్రజలు కోరుకుంటున్నారని సనత్‌నగర్ డివిజన్ భాజపా అభ్యర్థి కంచర్ల అన్నపూర్ణ చెప్పారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: భాజపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సనత్‌నగర్ భాజపా అభ్యర్థి కంచర్ల అన్నపూర్ణ అన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: భాజపా అభ్యర్థి
సనత్‌నగర్‌లో ఎక్కడ చూసినా సమస్యలే కనబడుతున్నాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ నాయకులు శ్రద్ధ చూపడం లేదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి నాయకత్వంలో భాజపా బలోపేతమవుతుందని చెప్పారు.
ఇదీ చదవండి:విత్తనాలు పొదిగిన పెళ్లి పత్రిక.. కేసీఆర్‌కి ఆహ్వానం!