తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు: ప్రహ్లాద్​ మోదీ - prahlad modi latest news

కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ప్రధాన మంత్రి జన కల్యాణ్ యోజన అభియాన్ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. హైదరాబాద్​ ముషీబాద్​లోని భోలక్​పూర్​ డివిజన్​లో పర్యటించారు.

prahlad modi campaign in ghmc elections in hyderabad
పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు: ప్రహ్లాద్​ మోదీ

By

Published : Nov 26, 2020, 4:07 AM IST

ప్రధాన మంత్రి సోదరుడు, ప్రధాన మంత్రి జన కల్యాణ్ యోజన అభియాన్ అధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్​ ముషీబాద్​లోని భోలక్​పూర్​ డివిజన్​లో పర్యటించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి చెల్లించే పన్నుల కన్నా 25% ఎక్కువగానే తీసుకుంటారని చెప్పారు. తెరాస పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. వారంతా భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు.

ఇదీ చదవండి:అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయండి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details