తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

డబుల్ బెడ్​రూం ఇండ్లు ఎవరికిచ్చిన్రు? : గూడ వరమ్మ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

మహిళా శక్తికి తాను నిదర్శనమని, భర్త చాటు రాజకీయాలు ఏనాడూ చేయలేదని, ఇకపైనా చేయబోనని జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గూడ వరమ్మ అన్నారు. గతంలో కౌన్సిలర్​గా అభివృద్ధి చేసిన అనుభవం ఉందని, గెలిపిస్తే డిపో మంజూరు కోసం పోరాటం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు వరమ్మ.

డబుల్ బెడ్​రూం ఇండ్లు ఎవరికిచ్చిన్రు? : గూడ వరమ్మ
డబుల్ బెడ్​రూం ఇండ్లు ఎవరికిచ్చిన్రు? : గూడ వరమ్మ

By

Published : Nov 24, 2020, 4:11 PM IST

జగద్గిరిగుట్టలో గతంలో కౌన్సిలర్​గా పనిచేసిన అనుభవం గల గూడ వరమ్మకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. డివిజన్​లోని అన్ని బస్తీలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె కోరారు. తన హయాంలో పేదలకు రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఇప్పించానని, సబ్​ స్టేషన్, వీధి లైట్లు తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పటి పాలకులు రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని ఇంతవరకు కేటాయించలేదని తెలిపారు. తనను గెలిపిస్తే జగద్గిరిగుట్టలో ప్రధాన సమస్యగా ఉన్న బస్ స్టాండ్ నిర్మాణం చేపిస్తామన్నారు.

డబుల్ బెడ్​రూం ఇండ్లు ఎవరికిచ్చిన్రు? : గూడ వరమ్మ

ABOUT THE AUTHOR

...view details