తెలంగాణ

telangana

అభివృద్ధి పనులు చూసి ఆదరించాలి : మీర్జా ముస్తఫా బేగ్

By

Published : Nov 29, 2020, 3:41 PM IST

మూడు సార్లు తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మీర్జా ముస్తఫా బేగ్. మరోసారి పార్టీ తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిందని తెలిపారు. తను చేసిన అభివృద్ధి పనులే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

నమ్మకంతోనే మరోసారి మరోసారి బరిలో.. : మీర్జా ముస్తఫా బేగ్
నమ్మకంతోనే మరోసారి మరోసారి బరిలో.. : మీర్జా ముస్తఫా బేగ్

హైదరాబాద్ పాతబస్తీ రియాసత్ నగర్ డివిజన్ నుండి మీర్జా ముస్తఫా బేగ్ ఎంఐఎం పార్టీ తరఫున 4వ సారి బరిలో నిలిచారు. గత 15 ఏళ్లలో తాను కార్పొరేటర్​గా ఉండి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని, అదే నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎంఐఎం పార్టీ ప్రజల్లో ఉండే పార్టీ అని, ప్రజలు ఎంఐఎం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.

నమ్మకంతోనే మరోసారి మరోసారి బరిలో.. : మీర్జా ముస్తఫా బేగ్

ABOUT THE AUTHOR

...view details