షాదీముబారక్, నీటి బిల్లు మాఫీలే గెలిపిస్తాయి : తెరాస అభ్యర్థి జావిద్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020
వరదసాయం అందని పేదలందరికీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే తెరాస సర్కారు సాయం అందిస్తుందని రెయిన్ బజార్ తెరాస అభ్యర్థి జావీద్ అన్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
షాదీముబారక్, నీటి బిల్లు మాఫీలే గెలిపిస్తాయి : తెరాస అభ్యర్థి జవీద్
హైదరాబాద్ పాతబస్తీలో రెయిన్ బజార్ తెరాస అభ్యర్థి ఎంఏ జావీద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వరద నష్టం అందని వారికి కేసీఆర్ వరదసాయం పదివేలు అందిస్తామన్నారు. ప్రచారంలో బాగంగా ప్రజలు ఇరవై వేల లీటర్ల వరకు నీటి బిల్లు రద్దు చేసిన తెరాసకే ఓటు వేస్తామని అంటున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు.