విద్యావంతురాలిని.. మార్పు కోసం నన్ను గెలిపించండి : రంజిత గౌడ్ - balajinagar tdp contestant ranjitha goud
తెరాస ఆరేళ్ల పాలనలో హైదరాబాద్కు చేసిందేమీ లేదని, కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్వహించలేని అసమర్థ పాలకులకు గుణపాఠం చెప్పాలని బాలాజీనగర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంజిత గౌడ్ కోరారు. మార్పు కోసం విద్యావంతులతో పాటు ప్రతిఒక్కరూ తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యావంతులు అంతా ఓట్లు వేస్తే మంచి నాయకులు వస్తారని, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని బాలాజీ నగర్ తేదేపా కార్పొరేటర్ అభ్యర్థి రంజిత గౌడ్ అన్నారు. కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. కేపీహెచ్బీ కాలనీలో పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభించారు రంజిత గౌడ్. ఆరేళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయడం లేదని అన్నారు. అభివృద్ధి చేసి ఉంటే రోడ్ల పైకి నీళ్లు ఇళ్ళలోకి వచ్చేది కావని ఆరోపించారు. తనను గెలిపిస్తే డ్రైనేజీ , తాగునీరు, రోడ్డు సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచలేని తెరాస హైదరాబాద్కు ఏం చేయగలదని ప్రశ్నించారు.