సంక్షేమ పథకాలు, అభివృద్ధే నన్ను గెలిపిస్తాయి : బొంతు శ్రీదేవి - ghmc charlapally trs contestant bonthu sridevi rammohan
చర్లపల్లి డివిజన్లో మేయర్ రామ్మోహన్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తెరాస అభ్యర్థి బొంతు శ్రీదేవి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లోని కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికలు ముగియగానే వరదసాయం అందరికీ అందుతుందని హామీ ఇచ్చారు.
చర్లపల్లి 3వ డివిజన్ నుండి నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వివిధ కాలనీల్లో ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో చర్లపల్లిని చాలా అభివృద్ధి చేసి చూపించామని, ఇంకా కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని శ్రీదేవి అన్నారు. తెరాస చేసిన అభివృద్ధి వల్లనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేసారు. వరద సహాయం కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే తిరిగి ప్రక్రియ ప్రారంభించి అందరికీ అందిస్తామన్నారు. ఈసారి గెలిపిస్తే పేద కార్మికులకు జీతాలు పెంచే విధంగా.. పరిశ్రమల యజమానులను ఒప్పిస్తానని భరోసానిచ్చారు.