జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతోంది. పలు చోట్ల వివిధ పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం డివిజన్ పరిధిలోని 44వ పోలింగ్ కేంద్రంలో తెరాస ప్రచారం చేస్తుందని భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. పోలింగ్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.
ఓటర్ స్లిప్‌లో తెరాస అభ్యర్థి వివరాలు - జీహెచ్ఎంసీ పోల్స్ 2020
హైదరాబాద్ వనస్థలిపురం డివిజన్ పరిధిలోని 44వ పోలింగ్ కేంద్రంలో తెరాస ప్రచారం చేస్తుందని భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. పోలింగ్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.
ఓటర్ స్లిప్‌లో తెరాస అభ్యర్థి వివరాలు
ఓటర్ స్లిప్‌లో తెరాస అభ్యర్థి వివరాలతో పాటు కారు గుర్తుకు ఓటేయాలని ఉండటంతో వెంకటేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ పోలింగ్ జరపాలంటూ డిమాండ్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ 44వ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చదవండి:ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!