తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు కార్యకర్తల సంబురాలు - bjp latest news

జీహెచ్​ఎంసీ ఫలితాలు రాకముందే భాజపా కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్​ భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు బాణసంచా కాల్చారు. భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

bjp workers celebrations at bjp state office in hyderabad
భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు కార్యకర్తల సంబురాలు

By

Published : Dec 1, 2020, 8:00 PM IST

హైదరాబాద్​ భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఓటింగ్ ముగిసిన తరువాత బాణసంచా కాల్చారు. ఓటర్ల తీరు, తమ సర్వేలు చూస్తుంటే.. భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేయర్​ పీఠం తమకే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎన్నికైనా తమదే విజయమన్నారు.

ఎంఐఎం, తెరాస కలిసి పలుచోట్ల రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. గెలుపు తమదేనని.. ఓటర్ల ఆశీస్సులు తమకే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు కార్యకర్తల సంబురాలు

ఇదీ చదవండి:బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?

ABOUT THE AUTHOR

...view details