గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకెళ్తున్నారు. రోడ్ షోల అనంతరం నాగోల్ జైపూర్కాలనీలో బస్తీ నిద్రలో భాగంగా రాజు అనే సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన బండి సంజయ్.. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రాంగణంలో నిద్ర పోయారు.
నాగోల్ జైపూర్కాలనీలో బండి సంజయ్ బస్తీ నిద్ర - బండి సంజయ్ బస్తీ నిద్ర వార్తలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార జోరు పెంచారు. మంగళవారం రోడ్డు నిర్వహించిన ఆయన నాగోల్ జైపూర్కాలనీలో బస్తీ నిద్ర చేశారు.
నాగోల్ జైపూర్ కాలనీలో బండి సంజయ్ బస్తీ నిద్ర
బస్తీలలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా బస్తీ నిద్ర కార్యక్రమాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఇలా బస్తీ నిద్రలో పాల్గొనడం ద్వారా సామాన్యుల కష్టాలు, వారి సమస్యలు తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు.
ఇదీ చదవండి:ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రాలుగా గ్రేటర్లో కాంగ్రెస్ ప్రచారం