Shobha Shetty Lover :కార్తీక దీపం సీరియల్‌లో విలన్‌గా తెలుగు రాష్టాల టీవీ ప్రేక్షకుల్ని అలరించిన శోభా శెట్టి.. ప్రస్తుతం బిగ్ బాస్ 7వ సీజన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తన పర్సనల్ విషయాలను మాత్రం ఇన్నాళ్లూ ఎవరికీ షేర్ చేయలేదు శోభా. కానీ.. దీపావళి సందర్భంగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో.. శోభాశెట్టి లవర్‌ను స్టేజ్‌పై నిల్చోబెట్టారు నాగార్జున.
మొన్నటి వరకు శోభా శెట్టికి ప్రియుడు ఉన్నాడనే విషయం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ.. బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాతే.. అప్పుడప్పుడూ తన లవర్ గురించి తేజతో చెప్తూ ఉంది. దీంతో.. ఆమెకు ప్రియుడు ఉన్నాడనే విషయం ఆడియన్స్‌కి తెలిసింది. అయితే.. ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ.. తన ప్రియుడి పేరు కూడా చెప్పలేదు. కానీ.. బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున డైరెక్ట్‌గా.. శోభా లవర్‌ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి నిల్చోబెట్టడంతో అందరికీ తెలిసిపోయింది. దీపావళి సందర్భంగా వచ్చిన బిగ్‌బాస్ ప్రోమోలో శోభా శెట్టి.. స్టేజ్ మీద తన లవర్‌ని చూసి అవాక్కయిపోయింది. ఇంతకీ అసలు శోభా ప్రేమికుడు ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో? తెలుసుకుందాం.
కార్తీక దీపం "డాక్టర్ బాబు" తమ్ముడే..
మహిళా ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్‌లో.. డాక్టర్ బాబు (నిరుపమ్) తమ్ముడిగా చేసిన.. ఆదిత్య (యశ్వంత్) అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే.. శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్. కార్తీక దీపం సీరియల్‌లో.. డాక్టర్ బాబు వెనకాలే చివరి వరకు మోనిత తిరిగింది. కానీ.. రియల్ లైఫ్‌లో అదే డాక్టర్ బాబు తమ్ముడిని తన చుట్టూ తిప్పుకుంటోంది. కార్తీక దీపం సీరియల్ పూర్తైన తర్వాత కూడా.. యశ్వంత్‌తో శోభా శెట్టి ఫ్రెండ్ షిప్ కొనసాగించింది. ఆ తరువాత వీరి స్నేహం ప్రేమగా మారిందని టాక్. కానీ.. ఈ విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా మోనిత పంచుకోలేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నట్లుగానే నటించారు.