తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'20 దేశాలు తిరిగా.. 6 వేల షోస్ చేశా.. కానీ జబర్దస్త్​కు వచ్చాక..' - జబర్దస్త్​ సునామీ సుధాకర్​

Jabardast Sunami Sudhakar: తన ప్రతిభతో అగ్ర హీరోల మేనరిజాన్ని అనుకరిస్తూ కామెడీ పండించగలడతడు. స్టేజ్​ ఆర్టిస్ట్​గా 20కి పైగా దేశాలు తిరిగి దాదాపు ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చాడు. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల నుంచి స్టార్​ హీరోల వరకు ఎంతో మంది ప్రశంసలను అందుకున్నాడు. అతడే 'జబర్దస్త్​' సునామీ సుధాకర్​. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన అతడు తన సినీకెరీర్​ గురించిన విశేషాలను తెలిపాడు. అవన్నీ అతడి మాటల్లోనే..

jabardast sunami sudhakar
జబర్దస్త్​ సునామీ సుధాకర్​

By

Published : Jun 17, 2022, 8:06 AM IST

'ఈటీవీ భారత్'​తో జబర్దస్త్​ సునామీ సుధాకర్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

Jabardast Sunami Sudhakar: ఎన్టీఆర్​ నటవిశ్వరూపం, ఏఎన్నార్ చలాకీతనం, రజనీ కాంత్​- చిరంజీవిల స్టైల్​, బాలకృష్ణలా డైలాగులు, నాగార్జున హావభావాలు.. ఇలా దాదాపు 20కి పైగా నటులను ఒకేసారి స్టేజిపైనే చూయించేస్తాడు ఆ కమెడియన్​. హీరోలను అనుకరిస్తూ ప్రేక్షకలను అలరిస్తాడు. కడుపుబ్బా నవ్విస్తాడు. అతడే సునామీ సుధాకర్​. తాజాగా ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు.. తన 'జబర్దస్త్​' ప్రయాణం, నటనను కెరీర్​గా ఎందుకు ఎంచుకున్నాడు? సహా పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ సంగతులివీ..

ఆ హీరోల ప్రశంసలు.. "2013 నుంచి చంద్ర టీమ్​లో చేస్తున్నాను. నేను, చంద్ర, మిమిక్రీ రాము.. 'బతుకు జట్కా బండి' అనే స్కిట్​ చేశాము. నాగబాబు, రోజాకు బాగా నచ్చింది. మాకు మంచి పేరు తీసుకొచ్చింది. అక్కడ నుంచే నా 'జబర్దస్త్'​ ప్రయాణం మొదలైంది. అదిరే అభి, చంటి, వేణు వండర్స్​ టీమ్స్​లో చేశాను. అప్పుడు నాగబాబు గారు.. 'నువ్వు, భాస్కర్​ టీమ్​లీడర్​గా ట్రై చేయండి' అని అన్నారు. అప్పుడు టీమ్​ లీడర్​ అయ్యాం. భాస్కర్ నాలోని ప్రతిభను బాగా బయటకు లాగాడు. అప్పుడు నాలోని కొత్త కోణాలు బయటికొచ్చాయి. ఆ తర్వాత 'పటాస్'​లో చేసిన స్కిట్​లు బాగా పాపులర్​ అయ్యాయి. చిరంజీవి, వెంకటేశ్​, బ్రహ్మానందం, రవితేజ వంటి వారు మమ్మల్ని గుర్తించి ప్రశంసించారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.

అలా ఎంట్రీ ఇచ్చా.. "మా నాన్నగారు ఓ చిన్న ఆర్టిస్ట్​. రిటైర్డ్ టీజర్​. మహబూబ్​నగర్​లోని ఓ చిన్న ఇన్​స్టిట్యూట్​లో ఆర్టిస్టుల బృందం ఉండేది. అక్కడే ఉండేవాడిని. నాకు మూడు, నాలుగేళ్ల వయసు నుంచే మా నాన్నగారితో తిరిగేవాడిని. పాటలు పాడటం కూడా నేర్చుకున్నా. సినిమా హీరోలను అనుకరించేవాడిని. అలా మా నాన్న ప్రోత్సహించడం వల్ల హైదరాబాద్​ వచ్చా. ఇక్కడ ఉన్న నా స్నేహితులు కూడా సపోర్ట్​ చేశారు. చాలా కష్టపడ్డాను. అయితే అది ఇష్టంగానే. దేవుడి మండపాల వద్ద ప్రోగ్రామ్స్​ చేశాను. స్కూల్​లో పార్ట్​ టైమ్​ జాబ్​ చేశా. ఆ తర్వాత 'పరుగు', 'నేనింతే', 'సప్తగిరి ఎక్స్​ప్రెస్'​ వంటి సినిమాలు చేశాను. ఆ సమయంలో మిమిక్రీ రాము ద్వారా 'జబర్దస్త్'​లోకి ఎంట్రీ ఇచ్చాను. అనంతరం మంచి పేరు వచ్చింది. మా నాన్నగారు గొప్పగా, ఆనందంగా భావించేవారు. మొత్తంగా 'జబర్దస్త్'లో ఉన్న వాళ్లందరూ​ బాగా సెటిల్​ అయ్యారు. సుడిగాలి సుధీర్​, గెటప్​ శ్రీను, ఆది , చలాకీ చంటికి మూవీస్​లో ఆఫర్లు వచ్చాయి." అని సుధాకర్​ చెప్పాడు.

20 దేశాలు, ఆరు వేల షోలు.. "ఆర్టిస్టులు అన్నాక అన్ని క్యారెక్టర్లు చేయాలి. మన మీద పంచ్​లు వేయించుకోవాలి. మనం ఇంకొకరి మీద పంచ్​లు వేయాలి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పర్సనల్​గా ఫీల్​ అవ్వకూడదు. లేదంటే వెళ్లిపోవాలి. నన్ను గాలిపటాల సుధాకర్​ అనేవారు. 20 దేశాల వరకు తిరిగా. ఆరు వేల షోస్​ చేశా. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, రజనీ కాంత్​, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా 20 మంది నటులను ఒకేసారి స్టేజ్​పైనే చూపించేవాడిని. కానీ జబర్దస్త్​ వచ్చాక సునామీ సుధాకర్​గా పేరు పెట్టారు. ఓ హోదా వచ్చింది. పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ నాకు స్టార్​డమ్​ రావడం సంతోషంగా ఉంది" అని సునామీ సుధాకర్​ అన్నాడు.

ఇదీ చూడండి: రెండేళ్లు టార్గెట్​.. 'జబర్దస్త్​'లో ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న.. లైఫ్​ ఛేంజ్​!

ABOUT THE AUTHOR

...view details