Jabardast Nookaraju: మధ్య తరగతి కుటుంబం.. ఓ చిన్న ఉద్యోగం.. కానీ నటన, కామెడీషోస్పై ఉన్న ఆసక్తి అతడిని ఇండస్ట్రీ వైపు నడిపింది. కానీ ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లినా అవకాశాలు రాలేదు. మాటలు కూడా పడ్డాడు! నిరుత్సాహం వెంట పడినా.. కళనే నమ్ముకున్నాడు. చివరకు ఓ కామెడీ షో ద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్లో ముందుకు సాగాడు. కట్ చేస్తే ఓ పాత్ర తన లైఫ్‌ను మలుపు తిప్పింది. మంచి పేరు తెచ్చి పెట్టింది. అతడే 'జబర్దస్త్' నూకరాజు. తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన అతడు ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? తన లక్ష్యం ఏమిటి? వంటి విషయాలను తెలిపాడు.
"నేను విజయవాడలో పుట్టాను. 'జబర్దస్త్'లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర కూడా సరదాగా నవ్వించేవాడిని. అందరూ బాగా నవ్విస్తున్నాను అనేవారు. అలా సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది. చాలా ఆడిషన్స్ ట్రై చేశాను. అవకాశాలు రాలేదు. ఏదేదో అనేవారు. ఆ తర్వాత 'జీ' తెలుగులో 'కామెడీ ఖిలాడి', 'పటాస్', 'పిట్టగోడ'.. అనంతరం 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేశాను. చంటి స్కిట్లలో నటించాను.