ఎక్స్ట్రా జబర్దస్త్ అంటేనే కడుపుబ్బా నవ్వించే షో. అలాంటి షో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుందని ఊహించగలరా? కానీ కొత్త ప్రోమోలో చేసిన స్కిట్‌తో భావోద్వేగానికి గురిచేసింది జబర్దస్త్ టీమ్. రాకింగ్ రాకేశ్ బృందం చేసిన ఓ స్కిట్ ఇందుకు కారణం. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను స్నేహాన్ని చాటిచెబుతూ సాగిందీ స్కిట్. 2013లో మొదలై హిట్ కాంబోగా నిలిచిన ఈ టీమ్ జబర్దస్త్‌లో చేసిన ప్రయాణాన్ని రాకింగ్ రాకేశ్, కెవ్వు కార్తీక్, నూకరాజు కళ్లకు కట్టినట్లు చూపించి జడ్జిలు, జబర్దస్త్ టీమ్స్‌కు కంటతడి పెట్టించారు.
'అందుకే వాళ్లు జబర్దస్త్‌కు దూరం'... ఒంటరినైపోయా అంటూ రాంప్రసాద్ కన్నీరు
రకరకాల స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయింది. అయితే ఈసారి కామెడీ మాత్రమే కాకుండా భావోద్వేగానికి గురిచేసి కన్నీళ్లు పెట్టించింది జబర్దస్త్ టీమ్. ఇంతకీ ఏమైంది?
జబర్దస్త్‌కు గెటప్‌శ్రీను, సుడిగాలి సుధీర్ ఎందుకు దూరమయ్యారనే కారణం చెబుతూ రాకేశ్ అండ్ టీమ్ అదరగొట్టేసింది. రాకేశ్ ఆటో రాంప్రసాద్‌గా, కెవ్వు కార్తీక్ సుడిగాలి సుధీర్‌గా, నూకరాజు గెటప్ శ్రీనుగా అలరించారు. ఈ స్కిట్ చూసిన రాంప్రసాద్ భావోద్వేగానికి గురవగా.. ఇంద్రజ కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు ఎప్పటిలాగే రాకెట్ రాఘవ కుమారుడు మురారి తనదైన స్టైల్లో నవ్వులు పూయించాడు. బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ కూడా ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుంది.
ఇదీ చూడండి :'ఎఫ్ 3' @ 100కోట్లు.. 'ఎఫ్ 4' స్క్రిప్ట్ వర్క్ షురూ!