తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చివరకు ఆ వీడియోలకూ జై సుధీర్ కామెంట్లు, న్యూస్ రీడర్ సెటైర్ - sudigali sundheer etv program

ఆగస్టు 27న తెలుగువారి ఇంటింటి టీవీ ఈటీవీ 27వ వసంతం. ఈ సందర్భంగా వచ్చే ఆదివారం(ఆగస్టు 28) రాత్రి 7.00 గంటలకు ఈటీవీలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందులో గ్లామర్ గర్ల్​ అనసూయ, మాటమాటలో చమక్కులు చిందించే చంద్ర, సుడిగాలి సుధీర్, ఆలీ​తో పాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. భలే మంచి రోజు పేరిట వచ్చే ఈ ప్రోగ్రాం ప్రోమోలు యూట్యూబ్​లో హల్​చల్​ చేస్తున్నాయి.

etv anniversary
ఈటీవీ కామెడీ

By

Published : Aug 23, 2022, 9:42 PM IST

Updated : Aug 24, 2022, 11:41 AM IST

ETV 27th Anniversary:ఆగస్టు 28.. ఆదివారం
ఆనందాల హరివిల్లు విరబూస్తుంది..
వినోదాల విరిజల్లు కురుస్తుంది..
ఆనందాల నావపై ప్రేక్షక జగతి ఓలలాడుతుంది..

ఎందుకంటే.. ఆగస్టు 27న తెలుగువారి ఇంటింటి టీవీ ఈటీవీ 27వ వసంతం. వచ్చే ఆదివారం రాత్రిపూట 7.00 గంటలకు ఈటీవీలో ఆనందాల వేట ప్రారంభం కాబోతోంది. జబర్దస్త్ ద్వారా తెలుగునాట సుపరిచితులైన గ్లామర్ గర్ల్​ అనసూయ, మాటమాటలో చమక్కులు చిందించే చంద్ర, సుడిగాలి ఇంటిపేరుగా పెట్టుకున్న సుడిగాలి సుధీర్ మరల ఈటీవీ వేదికపై సందడి చేయబోతున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నిర్వహించిన ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 7.00 గంటల నుంచి అందరిని అలరించబోతోంది. కొత్తగా వచ్చిన ప్రోమో చూస్తే.. వారు ఏ స్థాయిలో నవ్వించనున్నారో అర్ధమవుతుంది.

నటి ఇంద్రజ, పాపులర్ యాంకర్ మాచిరాజు ప్రదీప్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు రామ్ ప్రసాద్, హైపర్ ఆది వేసే పంచ్‌లు ప్రోగ్రామ్‌కి హైలెట్‌గా నిలవనున్నాయి. దేశంలోనే విఖ్యాత గాయకులైన కేజే ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ ఆలపించిన గీతాలు తన్మయత్వంలో ఓలాలాడిస్తాయి. హాస్యనటులు ఆలీ, పోసానీ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని టాక్. ఇంటిల్లిపాదిని ఆకట్టుకుని ఈటీవీ సీరియళ్లలోని నటీనటులు ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటీవీ న్యూస్ ప్రెజెంటర్లు న్యూ లుక్​లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఈటీవీ న్యూస్ ప్రెజెంటర్ శ్వేత​.. సుధీర్​పై సెటైర్లు వేశారు. చివరకు పందుల పెంపకం వీడియోల్లోనూ సుధీర్ గురించే కామెంట్లు ఉన్నాయని చెప్పేసరికి.. అక్కడ ఉన్నవారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

మరోవైపు, శ్రీ దేవీ డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను నవ్వించడానికి పలువురు కామెడీ యాక్టర్స్​తో ప్రత్యేక కార్యక్రమం ఉండనుంది. వీక్షకులు వీటిని ఎంతగా నవ్వుకుంటారో.. దాని ప్రోమోలోనే అర్దమవుతుంది.

ఇవీ చదవండి

అలా చేయడం నచ్చదు, అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయితే ఆనందిస్తా

రకుల్​ప్రీత్​ సింగ్​ ధరించిన ఈ డ్రెస్​ అంత కాస్ట్లీనా

Last Updated : Aug 24, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details