Bigg Boss Telugu Season 7 Pallavi Prashanth :ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రసారం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా ప్రశాంత్ మొదటిసారిగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను బిగ్‌బాస్‌లోకి రాకముందే అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు. అన్నదాతల బాధలను ఏకరువు పెడుతూ నెట్టింట పల్లవి ప్రశాంత్ భారీగా క్రేజ్ సంపాందించాడు. పట్టుబట్టి మరీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(Bigg Boss 7)లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్. అలా హౌజ్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం.. ఓ బియ్యం బస్తా తీసుకెళ్లి కింగ్ నాగార్జునకు కానుకగా ఇచ్చాడు.
Bigg Boss Telugu 7 : ఇప్పటికే తనదైన శైలిలో గేమ్స్, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్‌కు ప్రస్తుతం బాగా కంటెంట్ అందిస్తోన్న హౌజ్‌మేట్స్‌లో అతను కూడా ఒకరని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే హౌజ్ బయట కూడా రైతు బిడ్డ ప్రశాంత్కు భారీగా మద్దతు లభిస్తోంది. నామినేషన్స్‌లోనూ ఇతనికి పెద్ద మొత్తంలోనే ఓట్లు పోలవుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో తోటి కంటెస్టెంటే పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)ను టార్గెట్ చేస్తున్నారు. రైతు బిడ్డ అని చెప్పుకుంటూ పదే పదే సింపతీ క్రియేట్ చేసుకున్నాడంటూ తోటి కంటెస్టెంట్లు ప్రశాంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలతో రైతుబిడ్డ క్రేజ్ తగ్గకపోగా ఆయనకు.. మరింత క్రేజ్ పెరుగుతోంది.