Bigg Boss Telugu 7 Winner Prize Money :తన టాలెంట్‌తో బిగ్‌బాస్ షోలో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఆటతీరుతో, మాటతీరుతో టైటిల్ గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. 18 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి బిగ్‌బాస్ 7 విజేతగా నిలిచి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. గ్రాండ్ ఫినాలే చివర్లో అమర్‌దీప్, ప్రశాంత్ ఇద్దరే మిగలగా నాగార్జున రైతుబిడ్డను విన్నర్‌గా ప్రకటించారు.
ముందు నుంచి పల్లవి ప్రశాంత్ తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్ అనుకున్నారు.
కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే పని కోసం ఎదురచూశాడో ఇప్పుడు అదే స్టూడియోలో ఎందరో చప్పట్ల మధ్య బిగ్‌బాస్ 7 ట్రోఫీని అందుకున్నాడు. ఆ తర్వాత విజాయనందం ప్రశాంత్ మట్లాడాడు.
ప్రశాంత్ స్పీచ్ అదుర్స్!
"నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడి వరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. తినకపోయినా సరే ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే చేయగలనని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది.
నాగార్జున సార్ మీద చిన్న కవిత రాశాను- 'చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్ నవ్వు, ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్ నవ్వు, అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్ నవ్వు, సార్ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి'. ఇంకెంతోమంది జీవితాలు బాగుపడుతాయి. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చాను. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను" అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు ప్రశాంత్.
ప్రైజ్‌మనీలో కోత
Pallavi Prasanth Prize Money : అయితే బిగ్‌బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ఇప్పటికే ప్రకటించింది యాజమాన్యం. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్‌లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట.
అయితే ప్రశాంత్‌కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్షకుపైగా కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు సమాచారం. మొత్తంగా ప్రశాంత్ రూ.32 లక్షలకుపైగా నగదు అందుకున్నాడు. అలాగే ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నాడు. అయితే తాను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ కూడా పోను ప్రశాంత్‌కు దాదాపు రూ.25 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది.