Bigg Boss Winner Prediction in Telugu: మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్ 7కు ఎండ్‌కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమైన ఈ షో.. సుమారు 103 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ సీజన్లో ఈ షోకి ముగింపు పలకడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. దీంతో సోషల్‌మీడియాలో విన్నర్ ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఆసక్తికరంగా కొందరు "ఉల్టా-పుల్టా"ను ముందుకు తెస్తున్నారు.
డిసెంబర్ 17న జరగనున్న ఫినాలే ఎపిసోడ్లో.. తమ ఫేవరెట్ ప్లేయర్‌ను గెలిపించుకునేందుకు అభిమానులు భారీగా ఓట్లు వేస్తున్నారు. హాట్ స్టార్ యాప్‌లో ఒక ఓటు.. మిస్డ్ కాల్ ద్వారా కూడా ఒక ఓటు వేసే అవకాశం ఉండడంతో.. ఓట్లు పోటెత్తుతున్నాయనే చెప్పాలి. మిస్డ్ కాల్ ఇద్దామంటే లైన్స్ కూడా కలవట్లేదట. అంత రద్దీగా ఫోన్ లైన్స్ ఉన్నాయని అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా.. ఈసారి 13 రోజులపాటు ఓటింగ్ లైన్స్‌ని ఓపెన్ చేసి పెట్టారు. ఈ ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే.. వాళ్లే విన్నర్ అవుతారని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓటింగ్‌లో ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్లో ఉంది.
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే - చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో - దుమ్ము లేచిపోవడం ఖాయం!
మరి.. విజేతగా నిలిచేది ఎవరు? అన్నప్పుడు.. శివాజీ, అమర్, ప్రశాంత్ లలో ఒకరు టైటిల్ కొట్టేస్తారని జోరుగా చర్చ సాగుతోంది. ఈ ముగ్గురు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఎవరికి వారు తమ అభిమాన కంటిస్టెంట్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ఓ కొత్త టాపిక్‌ను తెరపైకి తెస్తున్నారు. అదే ఉల్టా-పుల్టా! తద్వారా.. విజేత కాబోయేది ఈ ముగ్గురూ కాకుండా మరొకరు అని చెప్తున్నారు. అందుకు తగిన వాదన కూడా వినిపిస్తున్నారు.
ఉల్టా - పుల్టా :ఈ సీజన్లో మొత్తం ఉల్టా పుల్టాగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఆట మొదలైనప్పటి నుంచి గేమ్స్, నామినేషన్స్, ఎలిమినేషన్స్ అన్ని ఉల్టాపుల్టానే. ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే.. మరొకరు బయటకు వెళ్లారు. దీని ప్రకారం చూసుకుంటే.. ఉల్టాపుల్టా పేరును సార్థకం చేసేలా.. ఈ సీజన్ విన్నర్ కూడా చర్చ జరుగుతున్న ముగ్గురిలో ఒకరు కాకుండా.. మరొకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ ఒక్కరు ప్రియాంక జైన్ అవుతారనే వాదన వినిపిస్తోంది.