Bigg Boss 7 Telugu Winner : వంద రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌కు.. నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో.. టైటిల్ ఎగరేసుకుపోయేది ఎవరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. హోరాహోరీగా సాగిన గేమ్‌లో టైటిల్ చేతులు మారినట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్7వ సీజన్ స్టార్టింగ్‌లో చెప్పినట్టుగానే గేమ్ ఉల్టా-పుల్టాగా సాగింది. ఫైనల్లో కూడా ఇదేవిధంగా జరిగినట్టు సమాచారం. ఫైనల్ షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన సమాచారం అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం సాగిపోతోంది. నెటిజన్లు ఏకంగా విన్నర్‌ను కూడా ప్రకటించేశారు. కొందరు కంటిస్టెంట్ల సంబంధీకులు నేరుగానే పోస్టులు పెట్టడంతో.. విజేతను కన్ఫామ్ చేసుకుంటున్నారు ఆడియెన్స్.
గ్రాండ్ ఫినాలేకు మొత్తం ఆరుగురిని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో శివాజీ, అమర్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక, అర్జున్ ఉన్నారు. ఇందులో.. అర్జున్ 6వ స్థానంలోనే ఎలిమినేట్ అయినట్టు టాక్. "ఫుల్టా పుల్టా" ద్వారా టైటిల్ పట్టేసే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగిన ప్రియాంక 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని సమాచారం. టఫ్ కంటిస్టెంట్గా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో క్విట్ అయినట్టు తెలుస్తోంది. రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోయినట్టు ప్రచారం సాగుతోంది.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో "ఉల్టా పుల్టా" - విన్నర్ ఎవరో తెలుసా?
టాప్-3లో ఉన్న శివాజీ, ప్రశాంత్, అమర్ మధ్య గట్టిపోటీ సాగినప్పటికీ.. అమర్ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. దీంతో.. టైటిల్ కోసం శివాజీ-ప్రశాంత్ మధ్య యుద్ధం సాగిందని టాక్. ఈ క్రమంలో.. శివాజీ విన్నర్ అని అంతా భావించినప్పటికీ.. ఆఖరులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఫైనల్ డ్రామాలో శివాజీ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడని తెలుస్తోంది. "రైతుబిడ్డ"గా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.