Bigg Boss 7 Telugu 8th Week Elimination Analysis : తెలుగు బుల్లితెరపై పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్బాస్ 7వ సీజన్.. ఎనిమిదో వారంలోకి ప్రవేశించింది. 14 మంది కంటిస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్.. ఫస్ట్ వీక్ నుంచే ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఏడు వారాలు ఎలిమినేషన్స్ జరగ్గా.. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటి బాట పట్టారు.
Bigg Boss Telugu 7 Season Latest Update :ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 7(Bigg Boss Telugu Season 7)లో ఒకవైపు నాలుగో కెప్టెన్సీ కోసం టాస్క్ నడుస్తుండగా.. మరోవైపు ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా యమా రంజుగా సాగుతోంది. అయితే.. 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, భోలే షావలి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, సందీప్, అశ్విని శ్రీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు.
తారుమారైన ఓటింగ్.. టాప్లో ఎవరు ఉన్నారంటే..
Bigg Boss 7 Telugu 8th Week Voting Results :ఎనిమిదో వారం నామినేషన్లలో ఉన్న 8మందికి సోమవారం నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా ఓటింగ్ ప్రకారం చూస్తే.. హీరో శివాజీ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక ఊహించని రీతిలో ఓట్లు సంపాదించుకుని సింగర్ భోలే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అమర్ దీప్ చౌదరి మూడో స్థానానికి పడిపోయాడు. అదేవిధంగా అశ్విని అనూహ్యమైన రీతిలో ఓట్లు పొంది.. నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఐదో స్థానంలో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారు.