Bigg Boss 7 Telugu 14th Week Elimination : మరి కొన్నిరోజుల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు తెరపడనుంది. డిసెంబర్ 17న బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Telugu 7 Season) గ్రాండ్ ఫినాలే జరగనుందని ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే హౌజ్‌లో ఫినాలే టాస్కులు ప్రారంభమయ్యాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టిన అంబటి అర్జున్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. గత వారం జరిగిన ఫినాలే అస్త్ర పోటీల్లో గెలిచి డైరెక్టుగా ఫినాలేలోకి దూసుకెళ్లిపోయాడు. దీంతో.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. మరి, ఈ వారం ఇంటి నుంచి వెళ్లేది ఎవరు..? అసలు ఎలిమినేషన్ ఉంటుందా..? ఉండదా..? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
Bigg Boss 7 Telugu 14th Week Voting Results : ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. ఇక 14వ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న అర్జున్ మినహా.. మిగిలిన వాళ్లు.. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా సోమవారం రాత్రి నుంచి స్టార్ట్ అయ్యాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. రైతు బిడ్డపల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాతి ప్లేస్‌లో శివాజీ ఉన్నాడు.
డేంజర్ జోన్లో ఆ ముగ్గురు..అయితే నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్ ఇప్పుడు అనూహ్యంగా కిందికి దిగిపోయాడు. అతని స్థానంలో సీరియల్ బ్యాచ్ లీడర్ అమర్ దీప్ వచ్చేశాడు. 17.89 శాతం ఓట్లతో అమర్ మూడో ప్లేస్‌లో ఉండగా, 17. 59 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ నాలుగో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక ఎప్పటిలాగే ప్రియాంక జైన్, శోభా శెట్టి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రియాంక, శోభతోపాటు ప్రిన్స్ యావర్ కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే. దీనికి తోడు శోభను సేవ్ చేసేందుకు ప్రిన్స్ యావర్‌ను ఎలిమినేట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 8) రాత్రి వరకు ఓటింగ్‌కు సమయముంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రిన్స్ యావర్ డేంజర్‌లో పడినట్లే. వీళ్ల ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే..
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ - ఆ రోజే ఎండ్ కార్డ్!