Bigg Boss 7 Telugu 12th Week Elimination Details: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. దీంతో.. కంటెస్టెంట్స్ అందరూ అదే టెన్షన్‌లో ఉన్నారు. గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగి.. ఆ పాస్ ఎవరి చేతికీ వెళ్లకపోవడంతో బిగ్ బాసే స్వయంగా ఎలిమినేషన్‌ను క్యాన్సెల్ చేశారని వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ చెప్పారు. అంతే కాకుండా.. వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా చెప్పారు. దీంతో.. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్‌లో ఒకరు ఫిక్స్ అయినట్టేనని.. ఆ రెండో వ్యక్తి ఎవరా? అని డిస్కస్ చేసుకుంటున్నారు.
8 మంది నామినేట్ :హౌజ్‌లో మొత్తం 10 మంది ఉన్నారు. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో.. ప్రియాంక, శోభాశెట్టి మినహా మిగిలిన ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, రతిక, అశ్విని నామినేషన్స్‌లో ఉన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ స్టార్ట్ అయ్యింది.
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ - ఆ రోజే ఎండ్ కార్డ్!
ఓటింగ్‌లో మార్పులు:ఎక్కువ ఓటింగ్ సంపాదించడం కోసం.. ప్రస్తుతం అమర్, శివాజీ, ప్రశాంత్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గతంలో శివాజీ నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతిసారీ.. ఓటింగ్‌లో అతనే టాప్‌లో ఉన్నాడు. కానీ ఈ వారం ఓటింగ్‌లో అనూహ్యంగా అమర్‌దీప్ లీడ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాతి స్థానాల్లో పల్లవి ప్రశాంత్, శివాజీ ఉన్నారు. వీరి తర్వాత స్థానాల్లో యావర్, గౌతమ్‌కృష్ణ ఉండగా.. ఓటింగ్స్‌లో చివరి స్థానంలో రతిక, అర్జున్, అశ్విని ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్ అశ్వినినే కాబట్టి.. తను ఈవారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక తనతోపాటు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని ఆలోచిస్తున్నారు.
గ్రాండ్‌గా బిగ్ బాస్ మానస్ పెళ్లి వేడుక - హాజరైన ప్రముఖులు
డేంజర్ జోన్‌లో అర్జున్..!వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వచ్చిన అంబటి అర్జున్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఓటింగ్ విషయంలో అర్జున్.. ఆఖరి మూడు స్థానాల్లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో అశ్వినితోపాటు అర్జున్ కూడా హౌజ్ నుంచి వెళ్లిపోతాడా? అని ఆడియెన్స్ అనుమానిస్తున్నారు. ఒకవేళ అర్జున్ కాకపోతే రతిక హౌజ్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లో ఉండటంతో.. రతిక లేదా అర్జున్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.