Bigg Boss 7 Telugu 11th Week Elimination : బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసరికి.. చిత్ర విచిత్ర సంఘటనలు, టాస్క్‌లు, నామినేషన్లు, ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. దీనికి తోడు " ఉల్టా పల్టా" నేపథ్యంలో.. ఎలిమినేషన్ టైం లో జనాలు ఊహించింది ఒకరి పేరైతే.. ఎలిమినేట్ అయ్యేది మరొకరుగా ఉంటున్నారు. మరి.. 11వ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలుసా?
నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..?ఈ సీజన్‌లో 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ.. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు జరిగింది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు.. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, శోభాశెట్టి, ప్రియాంక, అమర్దీప్, అర్జున్, అశ్విని నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కారణంగా అతను నామినేట్ కాలేదు.. మరోవైపు ప్రశాంత్‌కు ఒక్క ఓటే రావడం వల్ల అతను సేవ్ అయ్యాడు.
రామ్‌చరణ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ కీలక పాత్ర- అనౌన్స్ చేసిన డైరెక్టర్!
ఆమె అవుట్..! శుక్రవారంతో ఓటింగ్ ముగియడంతో అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం.. నామినేషన్స్‌లో ఉన్నవారిలో 34 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత అమర్ దీప్ 19 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుసగా రతిక, అశ్విని, ప్రియాంక, అర్జున్, గౌతమ్, శోభా ఉన్నట్లు ఓ అనధికార సర్వే చెబుతోంది. దీంతో ఈ వారం డేంజర్ జోన్‌లో శోభాతో పాటు గౌతమ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే.. ఓటింగ్‌లో చివరగా ఉన్న శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యిందని.. దీనికి సంబంధించిన షూట్ కూడా జరుగుతోందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
డబుల్ ట్విస్ట్ ఉండనుందా..? ఈ సీజన్‌లో ఇంకో నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలింది. సండే రోజు ఒకరు ఎలిమినేట్ అయితే.. ఇంకా తొమ్మిదిమంది హౌజ్‌లో ఉంటారు. ఆ నాలుగు వారాల్లో ఫినాలే వీక్‌ను పక్కకు పెడితే.. మూడు వారాలు మాత్రమే ఉంటుంది. ఎలాగైనా టాప్ 5 మెంబర్స్ ఫినాలే వీక్‌లో ఉంటారు. కాబట్టి, మూడు వారాలకు సంబంధించి నలుగురు కంటెస్టెంట్లు ఉంటారు. కాబట్టి.. అందులో ఒక వీక్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. అయితే ఆ డబుల్ ఎలిమినేషన్ ఈ వారం లేదా వచ్చే వారంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ రచ్చ- చేతిపై బాటిల్ పగలగొట్టుకున్న అశ్విని!