Bigg Boss 7 Telugu 10th Week Elimination : బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్.. 10వ వారానికి చేరింది. గడిచిన తొమ్మిది వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజామూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటి బాట పట్టారు. ఇక 10వ వారం నామినేషన్స్ కాస్తా సిల్లీగా జరిగాయి. ఈ సీజన్లో ఎక్కువగా రెండు రోజులు జరిగే నామినేషన్స్ ఈసారి ఒకే రోజుతో ముగించారు. హౌజ్‌లో మొత్తం 11 మంది ఉండగా.. 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో శివాజీ, ప్రిన్స్ యావర్, సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్(Rathika Rose)ఉన్నారు. మరి.. ఈ ఫ్యామిలీ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Bigg Boss 7 Telugu Family Week :ప్రస్తుతం నడుస్తున్న ఈ ఫ్యామిలీ వీక్‌లో.. ఇప్పటి వరకూ హౌస్‌లోకి శివాజీ కొడుకు, అర్జున్ భార్య, అశ్విని తల్లి తొలిరోజు వస్తే.. రెండో రోజు ప్రియాంక ప్రియుడు, గౌతమ్ తల్లి, భోలే భార్య వచ్చారు. ఇక మూడో రోజు శోభాశెట్టి తల్లి, అమర్ భార్య, యావర్ బ్రదర్ వచ్చారు. నాలుగో రోజు శుక్రవారం ఎపిసోడ్లో రతిక తండ్రి, రైతు బిడ్డ ప్రశాంత్ ఫాదర్ రానున్నట్లు తెలుస్తోంది. 10వ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే.. నామినేట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ ఫ్యామిలీ వీక్ బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు.
గతంలో శ్రీసత్యపై ఫుల్ నెగిటివిటీ ఉండేది. కానీ, ఆమె తల్లి వీల్ చైర్‌లో హౌజ్‌లోకి వచ్చేసరికి.. ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విధంగా.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ నామినేషన్స్‌లో ఉన్న వాళ్లకి సంజీవనిలా మారిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఈ ఫ్యామిలీ వీక్ రతికకు ఉపయోగపడకపోవచ్చనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. అందరి ఫ్యామిలీ మెంబర్స్‌ను ముందు పంపించడంతో.. వారికి సింపథీ పెరిగింది. ఎంతో కొంత పాజిటివిటీ వచ్చింది. రతిక పేరెంట్స్‌ను ఆఖరులో శుక్రవారం ఎపిసోడ్లో పంపనున్నారు. దీనివల్ల ఆమెకు పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. ఎందుకంటే.. నేటితో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు రతికకు పాజిటివిటీ వచ్చినా.. దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు కదా అంటున్నారు.
జబర్దస్త్ కొత్త యాంకర్‌గా బిగ్ బాస్ బ్యూటీ - సౌమ్య రావు స్థానంలో ఎవరొచ్చారంటే?