'పుష్ప' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు చాలా తక్కువగా యాడ్స్ చేసిన బన్నీ ఇటీవల వరుస యాడ్స్‌కు ఓకే చెప్పేస్తున్నారు. అనుకున్న సమయానికి షూట్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు ఆయనతో యాడ్ చేయడానికి మొగ్గుచూపుతున్నాయి.
తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ ఓ యాడ్ షూట్లో నటించారు. ఇందులో 'పెళ్లి సందD'తో ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరోయిన్ శ్రీలీల ఆయనతో జతకట్టారు. త్వరలోనే బుల్లితెరపై వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. అయితే ఇది ఏ కంపెనీకు చెందిన యాడ్ అనేది ఇంకా తెలియలేదు. యాడ్ షూట్ స్పాట్లో శ్రీలీల, అల్లు అర్జున్, త్రివిక్రమ్, కెమెరా మెన్లు కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.