ఇప్పటికే థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు సైతం రానున్నాయి. మరి ఈ వారంలో ఓటీటీ వేదికగా అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..
మాచర్ల నియోజకవర్గం.. హీరో నితిన్ నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం. డిసెంబర్ 9న జీ 5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లు.
యశోద.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా సందడి చేయనుంది. సరోగసి నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథ ఇది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యశోద.. ఆర్థిక అవసరాల రీత్యా సరోగసి పద్ధతిలో బిడ్డకి జన్మనివ్వడం కోసం డా.మధు (వరలక్ష్మి శరత్‌కుమార్)కు చెందిన ఆస్పత్రిలో చేరుతుంది. మరి, అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. హరి - హరీష్ దీన్ని తెరకెక్కించారు.
ఊర్వశివో రాక్షసివో.. అల్లు శిరీశ్ - అను ఇమ్మాన్యుయేల్ నటించిన రీసెంట్ హిట్ మూవీ 'ఊర్వశివో రాక్షసివో'. డిసెంబర్ 9 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. సహజీవనం నేపథ్యంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. రాకేశ్ శశి దర్శకుడు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్..! యువ నటుడు సంతోష్ శోభన్ నటించిన సరికొత్త చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. ఫరియా కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ నెల 9 నుంచి సోనీ లివ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
కాంతార (హిందీ) డిసెంబర్ 9
క్యాట్ (హిందీ సిరీస్) డిసెంబర్ 9
మనీ హెయిస్ట్ (కొరియన్ సిరీస్) డిసెంబర్ 9
డ్రాగన్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) డిసెంబర్ 9
డ్రీమ్ హోమ్ మేక్ ఓవర్ (ఇంగ్లీష్ సిరీస్) డిసెంబర్ 9
డాక్టర్ జీ (హిందీ) డిసెంబర్ 11