దక్షిణాది సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన హీరోలు ప్రభాస్, యశ్. అయితే బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్‌తో యశ్ పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోయారు. అయితే వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యశ్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సలార్ సినిమాలో.. కీలకమైన అతిథి పాత్ర ఉందట. దీంతో ఆ పాత్రను యశ్‌తో చేయించాలని ప్రశాంత్‌నీల్ భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆయనకు ఈ పాత్ర గురించి కూడా చెప్పారట ప్రశాంత్‌నీల్. అయితే 'కేజీఎఫ్ 1, 2'తో తనను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన.. ప్రశాంత్ నీల్ అడిగిన ఆ పాత్ర చేసేందుకు యశ్ ఒప్పుకున్నట్లు సమాచారం.