తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

‘మార్వెల్‌ యూనివర్స్‌’ తరహాలో 'కేజీఎఫ్​ 3'.. సరికొత్త లుక్​లో సల్మాన్​ భాయ్​ - ప్రభాస్ సలార్​ సినిమా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. కన్నడ రాకింగ్​ యశ్​, బాలీవుడ్ భాయ్​ సల్మాన్​ ఖాన్​ నటించనున్న కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

Yash KGF 3 release date annouced
యశ్​ కేజీఎఫ్ 3 రిలీజ్

By

Published : May 14, 2022, 2:09 PM IST

Updated : May 14, 2022, 10:20 PM IST

పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది 'కేజీఎఫ్‌2'. ఇప్పటికే రూ.1000కోట్ల కలెక్షన్లు దాటి 'ఆర్ఆర్ఆర్‌'ను దాదాపు బీట్‌ చేసేసింది. సినిమా విడుదలై నెల రోజులు అయినా ఇప్పటికీ బాలీవుడ్‌లో రాఖీభాయ్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఈ క్రమంలో 'కేజీఎఫ్‌' అభిమానులకు మరో తీపి కబురు. ఈ ఏడాదిలోనే ‘కేజీఎఫ్‌3’ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు. 'మార్వెల్‌ యూనివర్స్‌' తరహాలో 'కేజీఎఫ్‌3ని ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌ 'సలార్‌' ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35శాతం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే వారం మొదలయ్యే తర్వాతి షెడ్యూల్‌లో సింహభాగం షూటింగ్‌ పూర్తి చేస్తాం. అక్టోబరు లేదా నవంబరు నాటికి సినిమా పూర్తవుతుంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్‌3’ను అక్టోబరు నుంచి మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రీప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌ ఇలా మొత్తం పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది. 2024లో ‘కేజీఎఫ్‌3’ ని విడుదల చేయాలని భావిస్తున్నాం" అని విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు.

" 'కేజీఎఫ్‌3'ను మార్వెల్‌ యూనివర్స్‌ తరహాలో డిజైన్‌ చేసుకున్నాం. అంటే వివిధ చిత్రాల్లోని హీరోలు ఇందులో భాగస్వాములు అవుతారు. అంటే డాక్టర్‌ స్ట్రేంజ్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఇలా ఆ పాత్రలన్నీ ఒక సినిమాలో కలిసినట్లే ఇందులోనూ వేర్వేరు సినిమాల్లో ఉన్న హీరోలు కలుస్తారు. దాని వల్ల మేము ప్రేక్షకులను చేరే పరిధి మరింత విస్తృతమవుతుంది" అని చెప్పుకొచ్చారు.

Salmankhan new look and movie: సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలిపిన సల్మాన్​.. ఓ పోస్టర్​ను విడుదుల చేశారు. అయితే ఈ విషయం కన్నా ఆయన పోస్ట్​ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆక్టటుకుంది. ఎందుకంటే ఇందులో సల్మాన్ కొత్త లుక్​లో కనిపించారు. పొడవాటి జుట్టు... బ్లాక్ కోటు... కళ్ళజోడు... సల్మాన్ ముఖం పూర్తిగా కనబడలేదు. కానీ, ఆయన కొత్త లుక్‌లో కనిపించబోతున్నారనేది మాత్రం అర్థం అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు తీసిన స్టిల్​ అని తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ఒకే సినిమాతో షారుక్​, బిగ్​బీ, శ్రీదేవీ వారసులు ఎంట్రీ.. టీజర్​ రిలీజ్​

అందాల నటి, ఎంపీ 'నుస్రత్​ జహాన్​​' ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో..

Last Updated : May 14, 2022, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details