Yash 19 Movie Update :'కేజీయఫ్' సిరీస్ మూవీస్‌తో పాన్ ఇండియా రేంజ్లో విశేష ఆదరణను పొందిన కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో యశ్ చేయబోయే నెక్ట్స్ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారా? ఎలాంటి కథతో రాబోతున్నారా? ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. అయినా ఆయన ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయకుండా ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు.
Yash Geethu Mohandas :అయితే ఈ క్రమంలోనే పలువురు దర్శకుల పేర్లు వినిపించగా.. రీసెంట్గా రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న 'లయర్స్ డైస్'(హిందీ) ఫేమ్, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో పేరు తెరపైకి వచ్చింది. యశ్.. ఆమెతో సినిమా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ చిత్రం దాదాపు కన్ఫామ్ అని కూడా అన్నారు. తాజాగా ఇప్పుడు ఈ మూవీ స్టోరీ బ్యాక్ డ్రాప్ గురించి కూడా కొత్త వార్తలు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ యశ్.. తనకు సూపర్ సక్సెస్‌ను అందించిన సెమీ పిరియాడికల్ ఫిల్మ్‌నే ఎంచుకున్నారట. 1900లో గోవా మాఫియా కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటికే యశ్ హీరోగా పాపులర్ అయిన కేజీయఫ్ కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చినదే.