తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్​ న్యూస్.. మహేశ్‌-రాజమౌళి ప్రాజెక్ట్‌ క్రేజీ అప్డేట్​..! - rajamouli mahesh babu project update

దిగ్గజ దర్శకుడు రాజమౌళి, టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు కలయికలో ఓ సినిమా వస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్​ వచ్చింది. ఈ మేరకు ఓ ఇంటర్య్వూలో రచయిత విజయేంద్ర ప్రసాద్​ వివరాలు వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 31, 2022, 5:28 PM IST

మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ చేయనున్న సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ''మహేశ్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్‌ ఫ్రాంఛైజీగా రానుంది. ఈ సినిమా నుంచి సీక్వెల్స్‌ వస్తుంటాయి. సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయి. ప్రస్తుతం పార్ట్‌1 స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నాం'' అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న ప్రాజెక్ట్‌ ఇదే. యాక్షన్‌ అడ్వంచర్‌ సినిమాగా ఇది సిద్ధం కానుంది. అగ్ర తారాగణంతో భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందించనున్నారు. పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ సైతం ఇందులో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు మహేశ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన జక్కన్న ప్రాజెక్ట్‌ కోసం సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details