తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

World Most Successful Film Star : ప్రపంచంలోనే సక్సెస్​ఫుల్​ ఫిల్మ్​ స్టార్​.. 50చిత్రాలకు రూ.25లక్షల కోట్లు!.. ఎవరో తెలుసా? - ప్రపంచంలోనే సక్సెస్​ఫుల్​​ స్టార్ స్టాన్​ లీ

World Most Successful Film Star : ప్రపంచంలో అతి పెద్ద సినీ తార ఎవరంటే మనకు టామ్ క్రూజ్​, క్రిస్ హేమ్స్ వర్త్, రాబర్ట్ డౌనీ జూనియర్ లాంటి పేర్లు వినపడతాయి. కానీ దానికి సమాధానం వాళ్లెవరూ కాదు. నిజం చెప్పాలంటే ఆయన ఒక నటుడు కాదు. మరి ఎవరు? ఏం చేసేవారు?.. ఆ పూర్తి వివరాలు..

World Most Successful Film Star
World Most Successful Film Star

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 2:05 PM IST

World Most Successful Film Star : అమెరికాలోని హాలీవుడ్ మొదలు.. మన దేశంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వరకు ప్రపంచంలో మనకు అనేక సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. వీటిల్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్ అనగానే టామ్ క్రూజ్​, క్రిస్ హేమ్స్ వర్త్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ తారలతో పాటు షారుక్​ ఖాన్, రజనీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు గుర్తొస్తారు. కానీ వీళ్లెవ్వరూ కాదంటే ఆశ్చర్యం కలగక మానదు. వీళ్లంతా సరిహద్దులు దాటి అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

ఈ తారలంతా తమ సినిమాలతో బాక్సాఫీసును అల్లాడించారు. మూవీ స్టార్స్ సక్సెస్​ను కొలవాలంటే కొన్ని పారామీటర్లుంటాయి. వాటిని బట్టే వారి విజయాల రేటును అంచనా వేస్తారు. అయితే.. బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్ విషయానికి వస్తే ఈయన ఒక ఫ్రొఫెషనల్ యాక్టర్ కాదు కానీ, సినిమాల్లో కనిపించారు. అవి ఇతర ఏ యాక్టర్ కన్నా ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. ఇంతకీ ఆయన పేరు స్టాన్ లీ. ఆయన కార్టూనిస్టు, కామిక్ బుక్స్ రైటర్​గానూ పనిచేశారు. సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు.

Marvel Comic Writer Stan Lee : కామిక్ బుక్ లెజెండ్ రైటర్​గా పేరొందిన ఈయన.. తన కెరీర్​లో దాదాపు 50 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఎక్కువ శాతం తను క్రియేట్ చేసిన మార్వెల్ కామిక్స్ ఆధారంగా తీసినవే కావడం గమనార్హం. ఈ 50 చిత్రాల్లో సగానికి పైగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్​కు సంబంధించినవే. బాక్సాఫీసు వద్ద ఇవి 30.60 బిలియన్ డాలర్లు (రూ. 25 లక్షల కోట్లు) వసూలు చేయడం విశేషం. ఇది సినిమా రంగం చరిత్రలో ఏ ఇతర నటులతో పోల్చినా అధికమే.

ఇదే అంశంలో లీడ్ రూల్స్ పోషించే నటుల విషయానికి వస్తే.. ఇందులో స్కార్లెట్ జాన్సన్​కు ఆ ఘనత దక్కుతుంది. గ్లోబల్ బాక్సాఫీసు వద్ద ఆయన సినిమాల విలువ 14.56 బిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.12 లక్షల కోట్లు. స్టాన్ లీ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. 1989లో విడుదలైన ది ట్రయల్ ఆఫ్ ద ఇంక్రెడబుల్ హల్క్​లో మొదటి సారి తెరపై కనిపించారు. తర్వాత X – Men, Spider Man, Hulk, The Princess Diaries 2 లాంటి మార్వెల్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు.

స్టాన్ 2008 తర్వాత ఐరన్ మ్యాన్ లాంటి MCU లాంటి ప్రత్యేక చిత్రాల్లో మాత్రమే కనిపించేవారు. ఆయన చివరిసారిగా కనిపించింది అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో. కానీ ఇది ఆయన మరణానంతరం 2019 లో విడుదలైంది. స్టాన్ లీ గౌరవానికి గుర్తుగా మార్వెల్ స్టూడియో ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. తన నూతన చిత్రాల్లో లీ అతిథి పాత్రలను చేయడం నిషేధించాలన్న నిర్ణయం తీసుకుంది. లీ తన సుదీర్ఘ కెరీర్ లో 1940 నుంచి 70 ఏళ్ల పాటు మార్వెల్ కామిక్స్ కోసం పనిచేశారు. X-Men, Spider-Man, the Hulk, Ant-Man, Fantastic Four, Black Panther, Daredevil, Doctor Strange, and Black Widow లాంటి కొన్ని ఐకానిక్ కామిక్ క్యారెక్టర్లను సృష్టించారు.

ABOUT THE AUTHOR

...view details