తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శ్రీలంకతో ఆసియాకప్‌ ఫైనల్​.. మన అమ్మాయిలకు ఎదురుందా? - ఆసియా కప్​ 2022 టీమ్​ఇండియా శ్రీలంక

ఆసియాకప్​ ఫైనల్​ ఫైనల్​ మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ పోరులో గెలిచి టైటిల్ ముద్దాడాలని టీమ్​ఇండియా, శ్రీలంక పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరో గెలుస్తారో?

Asia cup final
శ్రీలంకతో ఆసియాకప్‌ ఫైనల్​

By

Published : Oct 15, 2022, 7:39 AM IST

Updated : Oct 15, 2022, 8:20 AM IST

ఆరు టైటిళ్లు గెలిచిన జట్టు ఒకవైపు.. ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ ఓడిన జట్టు మరోవైపు..! మరి మహిళల ఆసియా కప్‌లో ఈసారి గెలుపు ఎవరిది? అందరి ఫేవరెట్‌ భారతే! ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత జట్టు ఖాతాలో మరో టైటిల్‌ చేరడం ఖాయం అన్నదే అందరి అంచనా. ఫైనల్‌కు వచ్చిన నాలుగుసార్లూ మన జట్టు చేతిలోనే ఓడిన శ్రీలంక ఈసారి ఎలాగైనా కప్‌ ముద్దాడాలని పట్టుదలగా ఉంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య తుది పోరు ఆసక్తిరేపుతోంది. చరిత్ర, రికార్డులు, బలాబలాలు పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ ముందు లంక సరితూగదు. కానీ ఈ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తున్న ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌, షెఫాలివర్మ చెలరేగి ఆడితే టీమ్‌ఇండియాకు ఎదురుండదు. కానీ ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లే ఆడిన హర్మన్‌ 72 బంతులు ఎదుర్కొని 81 పరుగులే చేసింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధాన కూడా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. భారత్‌ ఫైనల్‌్ చేరడంలో కీలకపాత్ర పోషించిన షెఫాలివర్మ (161 పరుగులు, 3 వికెట్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (215 పరుగులు), దీప్తిశర్మ (94 పరుగులు, 13 వికెట్లు) మరోసారి రాణించాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు ఉత్కంఠభరిత సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన లంక.. ఫైనల్లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది. ఒషాడి రణసింఘే, హర్షిత మాధ్వి, నీలాక్షి డిసిల్వా స్థిరంగా రాణిస్తున్నారు.

*2004లో మహిళల ఆసియాకప్‌ ఆరంభించిన నాటి నుంచి 2016 వరకు వరుసగా భారత్‌ ఆరు టైటిళ్లు కొట్టింది. తొలి నాలుగు ఆసియాకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంకను ఓడించి టీమ్‌ఇండియా కప్‌ గెలవడం విశేషం. గత టోర్నీ (2018)లో మాత్రం బంగ్లాదేశ్‌ చేతిలో ఫైనల్లో కంగుతిని భారత్‌ రన్నరప్‌గా నిలిచింది.

ఇదీ చూడండి:టీ20 ప్రపంచకప్​నకు ఇంకొక్కరోజే.. ఆ ఛాంపియన్లు ఎలా ఆడతారో?

Last Updated : Oct 15, 2022, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details