తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అసలు ఊహించలేదు అలా జరుగుతుందని.. తెలియగానే ఏడుపు వచ్చేసింది!'

95వ ఆస్కార్​ అవార్డుల రేసులోకి ఆర్​ఆర్​ఆర్​ నాటు నాటు సాంగ్​ నామినేటైన సందర్భంగా ఆ పాట రచయిత చంద్రబోస్​ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సుచిత్రా చంద్రబోస్​ సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు.

naatu naatu for oscars
naatu naatu for oscars

By

Published : Jan 25, 2023, 1:24 PM IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ రేసులోకి ఆర్​ఆర్​ఆర్​ సినిమా నాటు నాటు సాంగ్​ అధికారకంగా నామినేటైన సందర్భంగా ఆ పాట రచయిత చంద్రబోస్​ హర్షం వ్యక్తం చేశారు. "ఈ విజయాన్ని నా తలపైకి ఎక్కించుకోను. నేను ఇంత వరకు ఇలాంటి కలలను ఎప్పడు కనలేదు. ఈ అవకాశాన్నిచ్చినందుకు రాజమౌళికి కీరవాణీకి ధన్యవాదాలు" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "చిన్న పల్లెటూరి నుంచి వచ్చి, సామాన్య నేపథ్యం ఉన్న నాలాంటి రచయితకు ఇది గొప్ప విజయం. ఇక 'నాటు నాటు' రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో రాసిన ప్రతి పదమూ.. నా బాల్యం, నా గ్రామం, నా కుటుంబానికి సంబంధించినదే. నా మనసులోని భావాలకు, జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చాను" అని అన్నారు.

ఇక ఆస్కార్‌ నామినేషన్‌ గురించి మాట్లాడుతూ.."ఇది నాకు నమ్మశక్యం కానిది, ఎంతో అపురూపమైనది. జాబితాలో మొత్తం 15పాటలు ఉన్నాయి. వాటిలో 'నాటు నాటు' ఒకటి. 'అవతార్‌'లోని పాటలకు 'నాటు నాటు'కు మధ్య పోటీ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ, అన్నింటినీ దాటి ఈ పాట టాప్‌5లో ఉంది" అని చెప్పారు.

ఈ విజయంపై గేయ రచయిత చంద్రబోస్ సతీమణి ప్రముఖ కొరియోగ్రాఫర్​ సుచిత్ర చంద్రబోస్​ సైతం ఆనందం వ్యక్తం చేశారు. "కీరవాణికి గోల్డెన్​ గ్లోబ్​ వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయన అవార్డు అందుకున్న సమయంలో మా కళ్లలోంచి నీళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇది ఆంధ్రా, తెలంగాణ వరకే పరిమితమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించింది. దీనికి మందు ఆయన లిరిక్స్​ కేవలం భారతదేశం వరకే ఫేమస్​. ఇప్పుడు అందరి నోట్లో నాటు నాటు సాంగ్​ నానుతున్నందకు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఇది ఒక సంచలనం సృష్టిస్తుందని నేను ఊహించాను. అయితే ఇంతకుముందు పుష్ప సాంగ్ 'ఓ అంటావా మావా' అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది. కాబట్టి ఇది కూడా వైరల్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఆస్కార్ రేసులో ప్రవేశిస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు" అని సుచిత్ర ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' నాటు నాటు పాట ఈ అవార్డు సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలంటే మార్చి13 దాకా వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details