Janvi kapoor sex with boyfriend: ఇటీవలే 'కాఫీ విత్ కరణ్ షో'కు విచ్చేసి సందడి చేసిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ జాన్వీకపూర్, సారా అలీఖాన్.. తమ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాఖ్యాత కరణ్.. వీరిద్దరి గురించి ఓ సీక్రెట్ బయటపెట్టారు. ఈ భామలిద్దరూ కలిసి ఒకే కుటుంబానికి చెందిన బ్రదర్స్‌తో డేటింగ్ చేసినట్లు తెలిపారు. అయితే వారి పేర్లను చెప్పలేదు.
దీంతోపాటే కరణ్.. జాన్వీని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ ప్రశ్నను అడిగారు. 'నీ ఎక్స్‌తో ఫిజికల్ రిలేషన్లో ఉన్నావా' అని అడిగారు. అయితే ఈ భామ తెలివిగా సమాధానం చెప్పింది. 'నో, గతంలోకి వెళ్లలేను' అని బదులిచ్చింది. ఇక ఈ షోలో జాన్వీ, సారా.. కేథరనాథ్లో తాము చేసిన సాహసాలు గురించి వివరించారు. తమ జర్నీ అత్యంత భయంకరంగా సాగినట్లు తెలిపారు. చావు దగ్గరకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. "భైరవనాథ్‌కు వెళ్లడానికి సాధరణమైన రోడ్డు ఉన్నప్పటికీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని అనుకున్నాము. ఆ కొండ బాగా ఏటవాలుగా ఉంది. నాకు చాలా భయమేసింది. ఎక్కడ దారిలో జారి పడిపోతానేమోనని చాలా భయపడ్డా. అయినా అలానే వెళ్లాం" అని సారా పేర్కొంది.