తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తల్లి కాబోతున్న ఆలియా.. మరి హాలీవుడ్ ఎంట్రీ సంగతేంటి? - రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్​ క్వీన్​ ఆలియా భట్​ హాలీవుడ్​ ఎంట్రీపై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. తాను తల్లి కాబోతున్నట్లు సోమవారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది ఆలియా. దీంతో ఇప్పటికే మొదలుపెట్టిన ఆమె హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.

alia bhatt hollywood
alia bhatt mom

By

Published : Jun 28, 2022, 7:28 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ జంట అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు 'అమ్మానాన్నలం కాబోతున్నాం' అంటూ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. సినిమా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో అలియా హాలీవుడ్‌ ప్రాజెక్టు సంగతేంటనే చర్చ మొదలైంది. తను కీలక పాత్రలో తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌'. దీనికోసం అలియా మే నెలలో బ్రిటన్‌ వెళ్లి కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. అది పూర్తవగానే 'రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ' కోసం ముంబయి తిరిగొచ్చింది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడు. ఈ షెడ్యూల్‌ పూర్తవగానే జులైలో మళ్లీ లండన్‌ వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలోనే అనుకోని శుభవార్త.

తల్లి కాబోతున్నట్లు ఆలియా ప్రకటన

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న హాలీవుడ్‌ చిత్రంలో అలియా ఇంకొన్ని పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే సన్నిహితవర్గాలు చెబుతున్న దాని ప్రకారం 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌'లో కొంతభాగం షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని అది కూడా పూర్తి చేస్తానని తను చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రం బహుశా కొంచెం ఆలస్యం అవుతుందే తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. ఇదికాకుండా ఫర్హాన్‌ అఖ్తర్‌ తెరకెక్కిస్తున్న 'జీ లే జరా' షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కత్రినా కైఫ్‌, ప్రియాంకా చోప్రాలతో కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత్ర ప్రశ్నార్థకంగా మారింది.

ఆలియా

ఇదీ చూడండి:'బాలీవుడ్​ను మాఫియా ఏలింది.. నాకు అవకాశాలు లేకుండా చేసింది'

ABOUT THE AUTHOR

...view details