Aamir khan Lalsingh chaddha: తన నటనతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. పాత్ర కోసం ఎంత కష్టాన్నైనే భరించేతత్వం ఆయనది. అందుకే అందరూ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అని పిలుస్తుంటారు. 1984లో 'హోలి' అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. అయితే ఈ చిత్రంలో ఆయన నటనతో పాటు డీ గ్లామర్ లుక్ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. తాజాగా 'లాల్ సింగ్ చద్ధా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్.. ఆ గెటప్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టారు. గతంలో తనకు లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు.. ఆ బాధను తట్టుకోలేక సరాసరి సెలూన్‌కు వెళ్లి గుండు కొట్టించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. ఇక అదే లుక్‌తో 'హోలి' చిత్రంలో నటించినట్లు చెప్పారు.
రక్తంతో ఆమిర్ ఖాన్ ప్రేమలేఖ.. కాదన్నందుకు గుండుకొట్టించుకుని.. - ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా
Aamir khan love failure: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. గతంలో తనకు లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు.. ఆ బాధను తట్టుకోలేక, ఏం చేయాలో పాలుపోని స్థితిలో గుండు కొట్టించుకున్నట్లు చెప్పారు.
"చాలా మంది సినిమా కోసం నేను గుండు చేయించుకున్నానని అనుకున్నారు. నిజానికి అది కారణం కాదు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు నో చెప్పింది. దీంతో ఏమి చేయాలో తెలియక గుండు చేయించుకున్నాను. ఆ తర్వాత అది తల్చుకుంటే నాది ఎంత మూర్ఖత్వమో అర్థమైంది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ కేటన్ నన్ను కలవమని చెప్పారు. అప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లగా.. 'నీ జుట్టు ఏది' అని అడిగారు. వెంటనే అక్కడే ఉన్న సిమి 'నేను గాఢమైన ప్రేమికుడిని' అని చెప్పింది. అలా ఈ సినిమాలో నా ఒరిజినల్ గెటప్‌ను కొనసాగించారు. అయితే నిజానికి ఓ అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు.. నేను తన భావనను గౌరవించి స్వీకరిస్తాను. గతంలో నా మాజీ భార్య రీనా దత్తాకు రక్తంతో లెటెర్ కూడా రాశాను" అని ఆమిర్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా, 'లాల్ సింగ్ చద్దా' సినిమా హాలీవుడ్ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్. ఈ చిత్రాన్ని దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించారు. కరీనా కపూర్ హీరోయిన్. నాగచైతన్య కీలక పాత్ర పోషించారు.
ఇదీ చూడండి: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆమిర్ ఖాన్.. ఎందుకంటే?