తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యూవీ నుంచి చేతులు మారుతున్న ప్రభాస్ సినిమాలు! - ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్​

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​కు.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​కు మధ్య మంచి స్నేహబంధం ఉంటుందని అంటుంటారు. ప్రభాస్​ సినిమాల్లో ఈ బ్యానర్​ భాగస్వామ్యం అవుతుంటుంది. ఇప్పటికే మూడు చిత్రాలు కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్రభాస్​ కొత్త సినిమాలు ఆ సంస్థ ​ నుంచి చేతులు మారుతున్నాయి. ఆ వివరాలు...

UV Creations Prabhas
ప్రభాస్​-యూవీ క్రియేషన్స్​ మధ్య ఏమైనట్టు?

By

Published : May 29, 2023, 3:55 PM IST

Updated : May 29, 2023, 4:09 PM IST

Prabhas UV Creations : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​కు.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​కు మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. ఈ సంస్థ ప్రభాస్​కు హోమ్ బ్యానర్ లాంటిదని చాలామంది అంటుంటారు. ఆ బ్యానర్​ నిర్మించే సినిమాల ఫంక్షన్​లకు అప్పుడప్పుడు ప్రభాస్ చీఫ్​ గెస్ట్​గా​ వస్తుంటారు. తెలుగులో 'భాగమతి', 'రన్ రాజా రన్', 'మిర్చి', 'రాధేశ్యామ్' లాంటి సినిమాలను నిర్మించిన ఈ సంస్థ.. దాదాపుగా ప్రభాస్ చేసే సినిమాలన్నింటిలో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆ బ్యానర్​.. రెబల్​స్టార్​తో కలిసి మూడు సినిమాల వరకు చేసింది. ఆ మూడింటిలో 'మిర్చి' సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. 'రాధేశ్యామ్' బాక్సాఫీస్​ వద్ద డిజాస్టర్​గా నిలవగా.. 'సాహో' చిత్రం కమర్షియల్​గా వసూళ్లను తెచ్చి పెట్టింది.

Adipurush theatrical rights : అయితే ఇప్పుడు ప్రభాస్​ చేయబోయే కొత్త సినిమాకు యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యం అవ్వట్లేదట. ​ఇప్పటికే.. ప్రభాస్ మరో రెండు వారాల్లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్'​ సినిమాతో జూన్​16న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్​ను మొదట యూవీ క్రియేషన్స్​ రూ.100కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ.. 'ఆదిపురుష్' థియేట్రికల్​​ రైట్స్​ను రూ.170కోట్లకు పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీకి అమ్మినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఇంకో కొత్త వార్త కూడా వచ్చింది. ప్రభాస్​.. త్వరలోనే అర్జున్​ రెడ్డి ఫేమ్​ దర్శకుడు సందీప్​ వంగాతో కలిసి 'స్పిరిట్'​ అనే భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. దీనిని యూవీ క్రియేషన్స్​తో కలిసి బాలీవుడ్​ టీ సిరీస్ ప్రొడక్షన్​ హౌస్​​ నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్​ యూవీ నుంచి పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరి చేతికి వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

.

Prabhas Maruti film : ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​లోనే ప్రభాస్​.. దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేస్తున్నారు. కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థతో రెబల్​ స్టార్​కు మంచి అనుబంధం కుదిరిందని.. అందులో భాగంగానే ఆ బ్యానర్​ చేతికి ప్రభాస్​ సినిమాలు వెళ్తున్నాయని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రభాస్​ లేదా యూవీ క్రియేషన్స్​ స్పందిస్తే గానీ స్పష్టత రాదు.

Last Updated : May 29, 2023, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details