Warner Alluarjun : ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో డేవిడ్ వార్నర్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై మెరుపు సెంచరీలు కూడా బాదాడు. అయితే వార్నర్ అంటే ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి, క్రికెట్ అభిమానికి ఎంతో ఇష్టం. ఎందుకంటే అతడు తన ఆటతో పాటు టాలీవుడ్ హీరోలకు చెందిన ఎన్నో సాంగ్స్‌ను రీల్స్‌గా చేసి ఆకట్టుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసి అదరగొట్టాడు.
నేడు అతడి పుట్టిన రోజు(Warner Birthday Wishes) సందర్భంగా చాలా మంది బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా.. "క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చాడు.
ఇకపోతే డేవిడ్ వార్నర్, అల్లు అర్జున్ మధ్య ప్రత్యేక బంధం ఉందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా వీళ్లు అప్పుడప్పుడు చాట్ చేసుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ పుట్టినరోజు.. వార్నర్ కూడా విషెస్ తెలిపాడు. అది కూడా పుష్ప స్టైల్లో చెప్పడం విశేషం. తన కూతురు ఐస్లా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ అని కూడా అప్పుడు చెప్పాడు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తెలుగు సినిమాలు, ఇక్కడి స్టార్లను వార్నర్ ఎక్కువుగా అనుకరించేవాడు వార్నర్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, అలవైకుంఠపురములో వంటివి చేశాడు. అవి నెటిజన్లను బాగా అలరించాయి.