War 2 Movie Shooting : జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'వార్ 2'. 2019లో విడుదలైన 'వార్'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
స్పెయిన్‌లో ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. సినిమాకు సెట్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందులో అయాన్, తన బృందంతో కలిసి సెట్స్‌లో ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. స్పెయిన్‌లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కారు ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు లీకైన ఫోటోలు, అందులో ఉంది. అయితే ఈ లీకైన ఫోటోలు, వీడియోల్లో ఎక్కడ కూడా హృతిక్, ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ఇద్దరు హీరోలు, హీరోయిన్ కియారా అద్వానితో కలిసి 'వార్ 2' సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
ఇక సినిమా విషయానికి వస్తే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక హృతిక్ రోషన్ ఈ సినిమాలో కబీర్ అనే పాత్రలో. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే ఓ రోల్లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.