తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్​తో పనిచేస్తారా?.. మీకు అరుదైన ఛాన్స్.. ఒక్క మెయిల్ చేస్తే చాలు! - డీవీవీ ప్రొడక్షన్​ హౌస్​

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​, సాహో డైరెక్టర్​ సుజిత్​ కలయికలో ఓ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ వేగంగా జరుగుతోందని సమాచారం. కాగా, చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​ ఈ సినిమాలో కొన్ని విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు పవన్​ కల్యాణ్​ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

Artist chance in Pavan Kalyan New Movie
Pavan Kalyan

By

Published : Dec 31, 2022, 9:05 PM IST

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పవన్​ మొదటి పాన్​ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, మాస్​ డైరెక్టర్​ హరీష్​ శంకర్​ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్​సింగ్​'లో నటిస్తున్నారు. మరోవైపు, పవన్ కొత్త ప్రాజెక్టు సుజిత్​ డైరెక్షన్​లో తెరకెక్కుతోంది. ఇటీవలే దానికి సంబంధించిన ఓ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. 'ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​' అని ఉన్న ఆ పోస్టర్​ మూవీపై అంచనాలను పెంచుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్​ సంస్థ డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​.. పవన్​ కల్యాణ్ సినిమాలో పనిచేసే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఆర్ట్, ఫ్యాషన్​, ఎన్​విరాన్​మెంట్​, కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఓ పోస్టర్​ విడుదల చేసింది. ఆ పోస్టర్​లో ఓ పెన్​పై జపనీస్​ భాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ పోస్టర్​ కింద #OG#firestormiscoming అని జత చేసింది. ఆసక్తి కలవారు team@theycallhimog.comకి తమ సీవీలను మేయిల్ చేయవచ్చని తెలిపింది. కాగా,​ సుజిత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమటోగ్రఫర్​గా రవి చంద్రన్​ వ్యవహరిస్తున్నారు.​ ఆర్​ఆర్​ఆర్​ తర్వాత డీవీవీ బ్యానర్​లో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో​ ఫ్యాన్స్​ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

డీవీవీ సంస్థ ప్రకటన

వీరమల్లు షూటింగ్​ శరవేగంగా..
పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details