మెగాస్టార్ చిరంజీవి-నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి'.. బాక్సాఫీస్ వద్ద జోరు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. వాల్తేరు వచ్చి 18 రోజులు కాగా, వీరసింహా వచ్చి 19 రోజులు అయింది. తాజాగా ఈ చిత్రాల కలెక్షన్ వివరాలు వచ్చాయి.
వాల్తేరు వీరయ్యకు 18వ రోజు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కలిపి రూ.56 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ.112.81కోట్ల షేర్.. రూ.182.20కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.8.05కోట్లు, ఓవర్సీస్లో రూ.13.07కోట్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.133.93 కోట్ల షేర్.. రూ.228.40కోట్ల గ్రాస్ వచ్చాయని సమాచారం.
వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున సినిమాను నిర్మించింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 129.84 గ్రాస్, రూ.76.91కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ వచ్చాయని తెలిసింది.
ఇక ఈ రెండు చిత్రాల తర్వాత రీసెంట్గా జనవరి 25న రిలీజైన పఠాన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా వసూళ్లనను సాధించిన ఈ చిత్రం తాజాగా ఆరో రోజు కూడా మంచి వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లో హిందీ వెర్షన్లో రూ.296 కోట్ల నెట్ సాధించింది. అంటే రూ.300కోట్ల మార్కుకు చేరుకుంది. దీంతో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్, సంజయ్ దత్ సంజు రికార్డులను అధిగమించింది. ఈ మార్క్‌కు చేరుకోవడానికి దంగల్‌కు 13రోజులు, సంజూకు 16రోజుల సమయం పట్టింది. ఇక పోతే ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.555కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఆరో రోజు రూ.600కోట్ల మార్కుకు చేరువగా వచ్చింది. అయితే ఆరో రోజు ఎంత కలెక్ట్ చేసిందో సరిగ్గా స్పష్టత లేదు.
ఇదీ చూడండి:రెండు భాగాలుగా పవన్-సుజిత్ సినిమా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అల్లు అరవిందా?