తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమెరికా థియేటర్లలో 'వాల్తేరు వీరయ్య' వీరంగం.. మొదటి రోజే ఇన్ని కోట్లా..! - వాల్తేరు వీరయ్య మూవీ అమెరికా కలెక్షన్లు

దేశంలోని బాక్సాఫీస్​ వద్దే కాకుండా ఓవర్సీస్​​లోనూ మన తెలుగు సినిమాలు కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తున్నాయి. మెగాస్టార్​ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తెరపై విజృంభించారు. గురువారం విడుదలైన 'వీరసింహారెడ్డి' సినిమా రెండు రోజుల వసూళ్లతోపాటు.. శుక్రవారం విడుదలైన 'వాల్తేరు వీరయ్య'కి సంబంధించిన మొదటి రోజు బాక్సాఫీస్​ కలెక్షన్ల వివరాలను ఓ సారి చూసేద్దాం.

Walteir Veerayya Veerasimhareddy Collections
Chiranjeevi Bala Krishna

By

Published : Jan 14, 2023, 9:10 PM IST

Walteir Veerayya Cinema Collections: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా అమెరికా థియెటర్లలో సునామి సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే ఒక మిలియన్​కి పైగా అమెరికన్​ డాలర్ల కలెక్షన్లను రాబట్టిందీ సినిమా. కాకపోతే భారత్​లో వసూళ్ల వివరాలు సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ మొదటి రోజు మొత్తంగా గ్రాస్ రూ.49.6 కోట్లు వసూలు అయినట్లు తెలుస్తోంది.

కాగా, మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ మాస్‌ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్‌ మార్‌ డ్యాన్స్‌లతో థియేటర్‌ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. థియేటర్లలోనూ మాస్‌ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్‌ స్టెప్పులు, ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌, రవితేజ చిరు కాంబో సీన్స్‌ టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు.

Veera Simha Reddy Cinema collections: ఇప్పటికే ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా తొలి రోజు రూ.54 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ అధికారికంగా తెలిపింది. 'బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత' అని క్యాప్షన్ జోడించింది. ఇక రెండో రోజు 'వాల్తేరు వీరయ్య' సినిమా విడుదలై గట్టి పోటీ ఇవ్వడంతో రెండో రోజు కేవలం రూ. 10 కోట్ల వసుళ్లను మాత్రమే రాబట్టింది 'వీరసింహారెడ్డి'. కాగా, ఇటీవలే రిలీజైన రెండు తమిళ సినిమాల కలెక్షన్లను 'వీరసింహారెడ్డి' అధిగమించిందని సినీ వర్గాల టాక్​. తమిళంలో విజయ్​ 'వారసుడు' రూ.26.5 కోట్లు రాబట్టగా.. అజిత్​ 'తెగింపు' సినిమాకు రూ.26 కోట్ల కలెక్షన్ వచ్చింది.

ఇక 'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానుల సందడి మధ్య సంక్రాంతి పండుగ జోరును కొనసాగించేందుకు 'వీరసింహారెడ్డి' గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఊరమాస్​ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు.

థియేటర్ల బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పాలాభిషేకాలు, టపాసులు కాల్చుతూ, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేశారు. చిత్ర ప్రదర్శన మొదలయ్యాక కూడా ఇదే తరహా సందడి కనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్స్‌, జై బాలయ్య పాట, పంచ్‌ డైలాగ్‌లు వచ్చినప్పుడు. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇకపోతే గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు.

ABOUT THE AUTHOR

...view details