Vyjayanthimala Dance Video : ఆరు పదుల వయసులో చాలా మంది తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. వాళ్లు చేసే పనులను చూస్తుంటే.. వయసు అనేది కేవలం ఓ నెంబర్ మాత్రమే అనేలా ఉంటాయి. అలా ప్రముఖ నటి వైజయంతిమాల చేసిన ఓ పని ఇప్పుడు అభిమానులను, నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఏకంగా 90 ఏళ్ల వయసులో ఆమె డ్యాన్స్ చేసి అలరించింది.
Vyjayanthimala Dance Video : భళా బామ్మ.. 90 ఏళ్ల వయసులో సీనియర్ నటి భరతనాట్యం.. గ్రేస్ అస్సలు తగ్గలే! - 90 ఏళ్ల వయసులో సీనియర్ నటి భరతనాట్యం
Vyjayanthimala Dance Video : స్టార్ హీరోయిన్, సీనియర్ నటి వైజయంతిమాల.. తొంభై ఏళ్ల వయసులోనూ తన గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. తాజాగా ఆమె 90వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భరతనాట్యం చేసి అందరి చేత ఔరా అనిపించారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి..
Published : Aug 30, 2023, 10:48 AM IST
ఇటీవలే తన 90వ పుట్టినరోజును సందర్భంగా చెన్నైలోని నివాసంలో వైజయంతిమాల బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీలో ఆమె భరతనాట్యం చేసి వైజయంతిమాల అందరిని అబ్బురపరిచారు. వన్నె తరగని అందంతో తొమ్మిది పదుల వయసులోనూ మెరిసిపోతున్న ఆమె..నాట్యంలోని భంగిమలను అలవోకగా పెట్టి అందరి చేత ఔరా అనిపించారు. ఆ వీడియోను చూస్తే ఆమెకు 90 ఏళ్లు అని ఎవరూ అనుకోరు. అంతలా గ్రేస్ చూపించారు వైజయంతిమాల.
Vyjayanthimala Movies :ఇక వైజయంతిమాల కెరీర్ విషయానికి వస్తే.. నాగిన్, దేవదాస్, సాధన, సర్గం గంగా జమున లాంటి హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. 1950ల్లో టాప్ హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. 1949లో విడుదలైన 'వాల్కై' అనే తమిళ చిత్రంతో సినీ తెరంగేట్రం చేసిన వైజయంతిమాల.. పదమూడేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత 'బహార్' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యారు. అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్‌కు.. 1954లో విడుదలైన 'నాగిన్' సినిమా బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమె స్టార్డం ఇంతకింత పెరిగిపోయింది. 1968లో పద్మశ్రీని అందుకున్న వైజయంతిమాల.. 1965 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి అప్పటి నుంచే ఫ్యామిలీమెంబర్స్తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక వైజయంతిమాల ఆర్టిస్ట్‌గానే కాకుండా గోల్ఫ్ ప్లేయర్‌గా, రాజకీయ నాయకురాలిగా, క్లాసికల్ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.1989లో తమిళనాడు ఎన్నికల్లో పాల్గొని రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో ఓ పార్టీలో చేరి అక్కడ కూడా తమ నాయకత్వ ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగారు.