తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​, ఆ సూపర్​హిట్​ సినిమా రీరిలీజ్​ - vyjayanhti movies indra 4k version

మెగాస్టార్‌ అభిమానులకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ గుడ్​ న్యూస్​ చెప్పింది. చిరంజీవి సూపర్​హిట్​ సినిమా ఇంద్రను నేటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది గ్రాండ్‌ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Surprise To Mega Fans
Surprise To Mega Fans

By

Published : Aug 14, 2022, 6:05 PM IST

Surprise To Mega Fans: మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్ని ఉద్దేశిస్తూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ట్వీట్‌ చేసింది. నేటి టెక్నాలజీకి అనుగుణంగా 'ఇంద్ర'ను తీర్చిదిద్ది గ్రాండ్‌ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. "డియర్‌ మెగా ఫ్యాన్స్‌.. 'ఇంద్ర'ను 4కె వెర్షన్‌లో మీ ముందుకు తీసుకురానున్నాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి కాస్త సమయం పడుతుంది. ఆరోజు కోసం మీరే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా ఈ సినిమా రీ రిలీజ్‌ మాత్రం గ్రాండ్‌ లెవల్‌లో జరగనుంది" అని పేర్కొంది. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నుంచి వచ్చిన ఈ సడెన్‌ ట్వీట్‌పై స్పందిస్తూ ధన్యవాదాలు చెబుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లోని ది బిగ్టెస్ట్‌ హిట్స్‌లో 'ఇంద్ర' ఒకటి. బి.గోపాల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. సోనాలీబింద్రె, ఆర్తి అగర్వాల్‌ కథానాయికలు. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 20 ఏళ్లు అవుతోంది. దీంతోఇంద్ర'ను 4కె వెర్షన్‌లో రీ రిలీజ్‌ చేయమంటూ అభిమానులందరూ ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డేని పురస్కరించుకుని 'ఇంద్ర'ను థియేటర్లలో విడుదల చేయమంటున్నారు. అభిమానుల నుంచి వస్తోన్న వరుస ట్వీట్స్‌పై స్పందించిన వైజయంతి మూవీస్‌ తాజాగా ఈ ట్వీట్‌ చేసింది.

ABOUT THE AUTHOR

...view details