టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్ - హీరో ఎన్టీఆర్ కాంబో ఒకటి. తొలి ప్రయత్నం 'ఆది'తోనే ఈ ఇద్దరు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అదుర్స్ వంటి సూపర్‌హిట్ సినిమా కూడా చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే అప్పటి నుంచి పట్టాలెక్కలేదు. అసలు దాని గురించి ఎక్కడ ఎటువంటి ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్.. పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. ఇందులో భాగంగానే అదుర్స్ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు.
"అదుర్స్ 2పై ఇక తెరకెక్కించేది ఉండడు. ఒకటి రెండు ఐడియాలు వచ్చాయి. కానీ అవి ముందుకు కదలలేదు. నాకే నచ్చలేదు. మా ఇద్దరి కెరీర్లో అది మంచి సినిమా. దాన్ని అలానే పాడుచేసుకోకుండా ఉంచితే మంచిది" అని అన్నారు. భవిష్యత్‌లో మంచి కథ దొరికితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని చెప్పారు. ఇక 'ఆది' సినిమా గురించి మాట్లాడుతూ.. ఆది కథ రెండు రోజుల్లో రాసినట్లు గుర్తు చేసుకున్నారు. అది అలా జరిగిపోయిందని చెప్పారు. చిరంజీవి గురించి చెబుతూ.. ఆయనతో చేయడం ఎక్సైట్మెంట్గా ఉంటుందని చెప్పారు. తనకంతో సపోర్ట్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. తన కెరీర్లో ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, ఖైదీ నెంబరు 150 అని చెప్పారు. ఖైదీ నెంబరు 150 చిత్రీకరణను ఎంతో ఆస్వాదిస్తూ పనిచేసినట్లు చెప్పారు.