గత కొంతకాలంగా చిత్రసీమలో ట్రెండ్ మారింది. 'కంటెంట్ ఉంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే' అన్నట్టు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి కంటెంట్ ఉంటే చాలు బ్రహ్మారథం పట్టేస్తున్నారు. దీంతో కంటెంట్ కొత్తగా.. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంటున్నాయి. అలాంటి చిన్న సినిమాల జాబితాలో వస్తున్న మరో మూవీనే 'ముఖ చిత్రం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. 'అందరూ అనుకుంటున్నా కథ ఇది.. కానీ అసలు జరిగింది ఇది'.. అంటూ ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. విజువల్స్, కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి.
ట్రైలర్లో చూపించిన కథ.. ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ని ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది. అతడు ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంతలో ఒక రోడ్ ప్రమాదం జరుగుతుంది. హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి కోమాలోకి వెళ్లి చనిపోతుంది. మొదట రిజెక్ట్ చేసిన అమ్మాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోని చనిపోయిన భార్య స్థానంలోకి వచ్చి హీరోపైన కేస్ పెడుతుంది. ఇక్కడి నుంచి కేస్ ఎలాంటి మలుపు తిరిగింది అనే లైన్‌తో 'ముఖచిత్రం' సినిమా తెరకెక్కింది. మరి ఆ ట్విస్ట్‌లు ఎంతో తెలియాలంటే డిసెంబరు 9వరకు ఆగాల్సిందే.