తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Vishwak Sen Marriage : విశ్వక్​ సేన్ షాకింగ్ సర్​ప్రైజ్​.. త్వరలోనే పెళ్లి.. అమ్మాయి ఎవరబ్బా? - Viswak Sen wife news

Vishwak Sen Marriage : యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన కొత్త పోస్ట్‌ హాట్​టాపిక్​గా మారింది. ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు!

Vishwak Sen Marriage
విశ్వక్ సేన్ పెళ్లి

By

Published : Aug 13, 2023, 8:00 PM IST

Updated : Aug 13, 2023, 8:15 PM IST

Vishwak Sen Marriage : 2017లో 'వెళ్లిపోమాకే సినిమా'తో టాలీవుడ్ ఆడియెన్స్​కు ఇంట్రడ్యూస్ అయిన విశ్వక్​ సేన్.. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైందీ' అంటూ హిట్​ అందుకున్నారు. దీంతో ఆయన మంచి గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అలా ఓ వైపు మాస్ మసాలా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రేమ కథ చిత్రాలతో తన ఫ్యాన్స్​, ఆడియెన్స్​ను అలరిస్తూ ఉన్నారు. ఫలక్ నుమదాస్, దాస్ కా ధమ్కీ, ముఖ చిత్రం, హిట్ వంటి మాస్ అండ్​ డిఫరెంట్ కాన్సెప్ట్​ స్టోరీస్​తో పాటు పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా లాంటి లవ్​ స్టోరీస్​ మూవీస్ కూడా చేశారు.

అయితే తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో పెట్టిన కొత్త పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. లైఫ్​లోకి కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెప్పాడు. "నా ఫ్యాన్స్​, శ్రేయోభిలాషులకు.. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞుణ్ని. లైఫ్​లో మరో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నానని తెలియజేసేందుకు సంతోషంగా ఉంది" అని విశ్వక్‌ రాసుకొచ్చారు. ఆగస్టు 15న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

ఇక ఇది చూసిన సోషల్ మీడియా యూజర్స్​ కచ్చితంగా విశ్వక్​ పెళ్లి గురించే చెప్పారని, దానినే అనౌన్స్​మెంట్​ చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇంకేదైనా చెప్పబోతున్నారేమో అంటూ కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది. అంతా దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

Vishwak Sen Upcoming Movies : ప్రస్తుతం విశ్వక్ సినిమాల విషయానికి వస్తే... ఆయన చివరగా దాస్ కా ధమ్కీ చిత్రంతో వచ్చారు. కథ పరంగా హిట్​ కాకపోయినా కమర్షియల్​గా పర్వాలేదనిపించుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లు రాలేకపోయాయి. ప్రస్తుతం ఆయన 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో పాటు మరో చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్​గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫస్ట్ లుక్​ పోస్టర్​, గ్లింప్స్​ విడుదలై బాగానే ఆకట్టుకున్నాయి.

తేడా వస్తే నవ్వుతా నరాలు తీస్తాం.. విశ్వక్​ సేన్ పవర్​ఫుల్ వార్నింగ్​ ఎవరికో?

రవితేజ మల్టీ స్టారర్​లో విశ్వక్ సేన్​.. విలన్​గా మంచు మనోజ్​?

Last Updated : Aug 13, 2023, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details