అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో గతేడాది బాక్సాఫీస్ ముందు అలరించిన యాటిట్యూడ్ స్టార్ విశ్వక్ సేన్.. ఈ ఉగాదికి 'దాస్ కా దమ్కీమ్కీ'తో పాన్ ఇండియా లెవల్లో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇందులో ఆయన డబుల్ రోల్ చేయడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. అందుకే ఈ చిత్రంపై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం.. ప్రీరిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మరింత ఆసక్తి ఎక్కువైంది. మరి ఈ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన మన దాస్.. ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడా.. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యాడా తెలుసుకుందాం..
ఎవరెలా చేశారంటే.. కృష్ణదాస్, సంజయ్ రుద్ర పాత్రల మధ్య డిఫరెన్స్‌ను విశ్వక్సేన్ బాగా చక్కగా చూపించారు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న సంజయ్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్ ఆకట్టుకుంది. అయితే ఆ రోల్‌ను సెకండాఫ్‌లో కొంత సమయం వరకూ మాత్రమే పరిమితం చేశారు. కీర్తి పాత్రలో నివేదా అందంగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆమె పాత్రకు అంతగా స్కోప్ లేదు. రావు రమేష్‌ది సాదాసీదా పాత్ర. పెద్దగా ఏమీ లేదు. హైపర్ ఆది, మహేశ్ తన మార్క కామెడీతో కనిపించినంత సేపూ నవ్వించారు. ముఖ్యంగా 'హ్యాపీడేస్'లోని టైసన్ పాత్ర తరహాలో మహేశ్ చెప్పిన డైలాగ్‌లు, తరుణ్ భాస్కర్‌తో ఆయన ఆడుకునే ఎపిసోడ్ బాగా నవ్వు తెప్పించింది. దర్శకుడిగా విశ్వక్ పర్వాలేదనిపించినా, కథలోనే అంత బలం లేదని చెప్పాలి. ఫస్టాఫ్ కాలక్షేపాన్నిచ్చినా.. సెకండాఫ్ సహనానికి పరీక్ష అనే చెప్పాలి. క్లైమాక్స్ ముందొచ్చే ట్విస్ట్‌లు కొన్ని ఆకట్టుకోగా.. మరికొన్ని కన్ఫూజన్ చేస్తాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. 'మావా బ్రో', 'పడిపోయిందే పిల్లా' పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగానే ఉన్నాయి.
బలాలు: విష్వక్ అద్భుతంగా నటించారు. విరామ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు, కొన్ని కామెడీ ట్రాక్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.